ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ నిషేధం కలేనా?
అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా?
ఇకనైనా మామూళ్ల మత్తు నుండి అధికారులు బైటకు రావాలి?
పర్యావరణ పరిరక్షణ అధికారులకు పట్టదా?
నామమాత్రపు దాడుల వెనుక అధికారుల ముందస్తు సమాచారం ఉందా??
అధికారుల అత్యుత్సాహం - ముందస్తు సమాచారం - మూత పడిన ప్లాస్టిక్ విక్రయ దుకాణాలు
కడప జిల్లా, ప్రొద్దుటూరు పసిడిపురిగా పేరు గాంచి బంగారానికి, వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరుగా రాయలసీమ జిల్లాల్లనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఒక నానుడి ఉంది, అయితే ఇది కాస్త ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రొద్దుటూరుగా పేరుగాంచుతోంది. ఇక్కడ అన్నింటితో పాటు నిషేధిత ప్లాస్టిక్ కూడా ఎక్కువగానే దొరుకుతుంది. ఇక్కడి నుండి ఒక బడా ప్లాస్టిక్ వ్యాపారి ఆంధ్రప్రదేశ్ అంతటా నిషేధిత ప్లాస్టిక్ సరఫరా చేస్తున్నడంటే అతిశయోక్తి కాదేమో! ఇక్కడ నిషేధిత ప్లాస్టిక్ ఎంతగా ఉందో అందరికీ అర్థమవుతుంది. ఈరోజు మున్సిపల్ అధికారులు స్థానిక కొనేటి కాల్వ వీధిలోని ప్లాస్టిక్ విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు వెళ్లిన అధికారులు కేవలం నామమాత్రంగా దాడులు నిర్వహించి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా చిరు వ్యాపారస్తుల పైన దాడులు చేసి, అక్కడ ఉన్న నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు పట్టుకున్నట్లు మీడియా ముందు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇటీవల ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ప్లాస్టిక్ పైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడంతో వీరు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. కాగా ప్రొద్దుటూరులో కోనేటి కాల్వ వీధిలోని కొంత మంది బడా వ్యాపారస్తులకు ముందస్తు సమాచారాన్ని కొంత మంది మున్సిపల్ సిబ్బంది ఇవ్వడంతో వారు ముందు జాగ్రత్తగా షాపులను మూసివేసి వెళ్లడం జరిగింది. దాదాపు రాష్ట్రానికి మొత్తం ప్రొద్దుటూరు నుండే నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ను సరఫరా చేస్తున్నట్లు సమాచారం. వేచి చూడాలి మరి అధికారులు ఏమాత్రం స్పందిస్తారో! అన్ని షాపుల పైన దాడులు నిర్వహిస్తారా? లేదా? అన్నది దుకాణాదారుల మధ్య జరుగుతున్న చర్చ. అధికారుల దాడులకు కేవలం కొంత మంది మాత్రమే బలి అవుతారా? అధికారులు ఇలా నామమాత్రపు దాడులు నిర్వహిస్తూ నెలనెలా మామూళ్ల మత్తులో జోగుతున్నారని స్థానికుల ఆరోపణ.
Comments