మనసున్న దాతలు ఆదుకోండి..
మా చిన్నారి రిషిక ప్రాణాన్ని కాపాడండి.
అన్నమయ్య జిల్లా చిట్వేలు గ్రామం బ్రాహ్మణ వీధికి చెందిన శంకరా కుమార్తె నాగులూరి కుమారి,ముని శంకర్ లు రోజువారి పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తుండగా..
తమ కుమార్తె రిషిక సరిగ్గా ఐదు సంవత్సరాలు కూడా నిండని వయస్సు తన అల్లారు ముద్దు మాటలతో మురిసిపోతున్న ఓ నిరుపేద కుటుంబానికి ఆ పాపకు జ్వరం చేయడంతో తగ్గడానికి తీసుకున్న మాత్ర ఊపిరి తిత్తుల లోకి వెళ్లి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో వారు వెంటనే తిరుపతి అమర హాస్పిటల్ కి వెళ్ళగా వారు మద్రాసులోని డాల్ఫిన్ హాస్పిటల్ కి సూచించడంతో అక్కడికి చేరుకున్న వారికి చికిత్స ఖర్చులు సుమారు 8 లక్షల వరకు అవుతాయని తేల్చి చెప్పడంతో చేసేదేమీ లేక తమకున్న ఇంటి దస్తావేదలను ఇతరులకు ఆయకం పెట్టి రెండు లక్షలు సమకూర్చుకోగా మిగిలిన మొత్తం కోసం గుండె బరువై, ఆలోచనలో పడ్డారు.
కాగా ఆ విషయం తెలుసుకున్న మండల పరిధిలోని పాత్రికేయులు, సిహెచ్ఎస్, మానవతా,వలసాని లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, సమాజ సేవకులు,యువత సదరు సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు చేరవేయడంతో మనసున్న దాతలు స్పందిస్తున్నారు.
కాగా వైద్యానికి కావాల్సిన నగదు పెద్ద మొత్తం కావడంతో బాధితులు "మనసున్న దాతలు ఆదుకోండి మా బిడ్డ ప్రాణాన్ని నిలపండి అంటూ" మొరపెట్టుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయదలిస్తే 9700044145 (నాగులూరి కుమారి/ముని శంకర్) అను నెంబర్ కు ఫోన్ పే చేయవచ్చని వారు అన్నారు.
Comments