రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి.
---రేపటి రోజున సిహెచ్ఎస్,జనసేనకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం.
---స్వచ్ఛందంగా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారివురు పిలుపు.
దాతలు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ఆపదలో ఉన్న పలువురి ప్రాణాన్ని కాపాడుతుంది అనడం లగ్న సత్యం. ప్రమాదాలలోనూ, సర్జరీలలోనూ, ప్రాణాపాయ స్థితిలోనూ రక్తమన్నది తప్పనిసరి.
కాగా... "భగవంతుడు జన్మనిస్తే రక్తదాత పునర్జన్మణిస్తాడు" అన్న తలంపుతో మెగా రక్తదాన శిబిరానికి రేపటి రోజైన శుక్రవారం నాడు చిట్వేలి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి బురానుద్దిన్ స్వామి దర్గా పక్కన ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు చిట్వేలి మండల హెల్ప్ లైన్ సొసైటీ వారు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు,అభిమానులు సంయుక్తంగా "మెగా రక్తదాన శిబిరాన్ని" నిర్వహించనున్నారు.
సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని వారు ఇరువురు కోరారు. రక్తదాతలుగా నిలిచిన వారికి ధ్రువపత్రం,రక్తం అవసరమైనప్పుడు ప్రాధాన్యత ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.
Comentarios