యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు వేసిన మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది అందరిదని చెప్పారు.
యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతాయని తెలిపారు. భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు.
కోట్లాది మంది ప్రజల మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచ శాంతి నెలకొంటుందని చెప్పారు. అందుకే యోగా ప్రజలను, దేశాలను కలుపుతోందని అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోని భారత్‌లోని అనేక ప్రాంతాలతో పాటు పలు దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Comentários