రాజారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం - శ్రీ శ్రీ శ్రీ త్రిడండి చిన్న జియర్ స్వామి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఉన్నతమైన విలువలతో విద్యను అందించాలన్న రాజారెడ్డి ఆశయాన్ని కొనసాగిస్తామని శ్రీ శ్రీ శ్రీ త్రిడండి చిన్న జియర్ స్వామి తెలిపారు. రూరల్ పరిధిలోని చౌడూరు శ్రీ పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో స్వర్గీయ రాజారెడ్డి సంస్కరణ, నూతన యాజమాన్య కమిటీని నియామక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చేసుకుంటుందన్నారు, నేటి నుండి స్వాధీనం చేసుకుంటుందన్నారు. గత 25 సంవత్సరాల క్రితం స్థానిక వ్యాపారవేత్త బుశెట్టి రామ్మోహన్ ద్వారా రాజారెడ్డి తో పరిచయం ఏర్పడిందన్నారు. తాను నిర్వహించే రాజా ఫౌండేషన్ను సందర్శించాలని కోరారన్నారు. ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడతానని భరోసా ఇచ్చానన్నారు. గత రెండేళ్ల క్రితం అల్లంపల్లిలో కలిసి తిరిగి అదే మాట చెప్పారన్నారు. అనంతరం నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు రాజారెడ్డి మరణ దుర్వార్త వినాల్సి వచ్చింది అన్నారు. అప్పటి కలెక్టర్ కృష్ణ బాబు అభ్యర్థన మేరకు ట్రస్టును తన అధీనంలోకి తీసుకున్నామన్నారు. రాజిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎడ్యుకేషన్ విద్యా సంస్థలను జీయర్ ఎడ్యుకేషన్ సంస్థలకు ఇప్పుడు అనుసంధానం చేశామన్నారు. ఒక విద్యాలయంలో విద్యాభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తుని మనం ఏమాత్రం డిస్ట్రబ్ కాకుండా ముందుకి నడిపించాల్సినటువంటి బాధ్యత అయితే శ్రీమాన్ రాజారెడ్డి కోరుకోడం చేత దాన్ని అలాగే జరిపించాలన్నారు. వ్యాపారకవేత్త బుశెట్టి రామ్మోహన్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అందుకు తగినట్లుగా మనం ఈ సంస్థని సిద్ధం చేయాలన్నారు. రాజారెడ్డి కోరిన మేరకు ఈ విద్యాలయాన్ని ఎంతో ఉన్నతంగా నిర్వహిస్తామన్నారు. సెక్రటరీగా ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీగా కిరణ్మయి తదితరులను నియమించారు.
Comentarios