--క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రెండు కంపెనీలలో కొలువు.
-కుటుంబసభ్యుల్లో వెల్లివిరిసిన ఆనందం.
--కళాశాల యాజమాన్యం,పలువురు అభినందనలు.
చదువుకు, కొలువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది అరుణ. తాను చదివింది ఉచిత ప్రభుత్వ పాఠశాల, కళాశాలే అయినా కొలువులో రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగానికి ఎంపికై తన సత్తాను చాటింది.
వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం చెర్లోపల్లి పంచాయతీ సదరు గ్రామానికి చెందిన లంజల. నరసయ్య, జయలక్ష్మికి ఏడుగురు సంతానంలో 6 వ సంతానమైన అరుణ ఏడవ తరగతి వరకు చెర్లోపల్లి విద్యనభ్యసించి 8 నుంచి 10 వరకు కస్తూరిబా పాఠశాలనందు చదివి 9.3 మార్కులు సాధించి, ఇంటర్మీడియట్ కడపలోని బాలయోగి గురుకులం నందు 92 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలై తదుపరి సివిల్ ఇంజనీరింగ్ ను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ SVIT కళాశాలలో ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న తాను ఆన్లైన్ ద్వారా నిర్వహించిన రాతపరీక్షలో INNOMINDS మరియు QSPIDERS కంపెనీలలో అన్ని పరీక్షల్లో అర్హత పొంది తన ఇష్ట పరంగా ఏదేని ఒక కంపెనీలో కొలువు తీరేందుకు సిద్ధంగా ఉంది.
అరుణ మాట్లాడుతూ.. ఎక్కడ చదివా మన్నది కాక, చదివిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లానని చదవాలన్న లక్ష్యం ముందు.. తన కుటుంబ పరిస్థితులు, పేదరికం ఇవేమి అడ్డురాలేదని తల్లిదండ్రులు, ఇద్దరి సోదరీల,నలుగురు సోదరుల ప్రోత్సాహం నా చదువుకు దోహదపడ్డాయని వారి కష్టాన్ని తగిన ఫలితం సాధించే దిశగా సాగిన నా ప్రయాణం ఫలించిందని ఆమె అన్నారు. మరింతగా కష్టపడి ఉన్నత లక్ష్యాన్ని చేరుకుంటానని పేర్కొన్నారు. అరుణ కొలువుతో తమ కుటుంబ సభ్యులు, పాఠశాల,కళాశాల యాజమాన్యం, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments