వైయస్ జగన్ హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి - పోతుగుంట రమేష్ నాయుడు
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
వాళ్ళ పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాన్ని వెంటనే తొలగించాలి
నేడు రాజంపేటలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు వైబియన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ గణపతి అభయాంజనేయ స్వామి దేవాలయం కూడలి నందు హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వైఎస్ఆర్సిపి అధికారిక వెబ్సైట్లో శివరాత్రి పర్వదినాన పోస్ట్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు నిరసనగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజున హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి చేసిన పోస్ట్ ను వ్యతిరేకిస్తూ హిందువులకు వైసీపీ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశాన్ని వెంటనే తొలగించాలని అన్నారు. హిందువులు ఓట్లు కావలసినప్పుడు గుళ్ళకు వెళ్లి దేవుళ్ళను మొక్కడం, శివలింగాలకు అభిషేకం చేయడం.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలా వారి మనోభావాలు దెబ్బ తినే విధంగా శివునికి అభిషేకాలు చేయడం కన్నా ప్రజలకు పాలు పంచిపెట్టడం బాగుంటుందని అనడం హిందువులను కించపరచడమేనని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసేలా పరమేశ్వరుడికే పాలు పట్టి శివతత్వాన్ని అవమానించేంత స్థాయికి జారిపోయారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి,సూర్యచంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు తోట నగేష్, పట్టణ కార్యదర్శి పి.రమణ, మండల ఉపాధ్యక్షులు డాక్టర్ రేణు ప్రసాద్ రాజు, బిజెపి నాయకులు పి.నాగేశ్వరరావు, పి.నాగేంద్ర ఎస్.బాబు, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments