అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి -- పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేట
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రాజంపేట బిజెపి అసెంబ్లీ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హస్తవరం చెర్లోపల్లె, లింగరాజు పల్లె, మిట్టమీద పల్లె, వరదయ్య గారి పల్లె, గుండ్లూరు తదితర గ్రామాలలో సోమవారం బీజేపీ బృందం పర్యటించి గాలివానకు నేలకొరిగిన పంటలను పరిశీలించారు.
ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన అరటి, దోస పంటలు నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రాజంపేట చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 15 ఎకరాల పైగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని.., చేతికొచ్చిన పంట మార్కెట్ లో అమ్ముకొనే సమయంలో ఈ అకాల వర్షాలు, గాలులు వల్ల ముఖ్యంగా అమృతపాణి, యాలకులు, సుగందాలు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఒక్కో ఎకరాకు సుమారు లక్ష రూపాయలు పైగా ఖర్చుపెట్టి పండించిన పంట నాలుగు వేళ్లు నోట్లో పెట్టుకునే సమయంలో ఇలాంటి ప్రకృతి విపత్తు కారణంగా దెబ్బ తినడం చాలా బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని.. రైతులకు పంట బీమా పథకం గ్రామస్థాయి యూనిట్ గా కాకుండా ఏ పంట నష్టపోతే ఆ రైతుకు నష్టం చెల్లించే విధంగా చట్టాల్లో మార్పు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కే.శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి జె.కె నాగరాజు, బిజెపి సీనియర్ నాయకులు టి.హరిప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
Comentarios