మొదలైన కరెంట్ కోతలు - చీకట్లో గ్రామాలు - అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి అంటున్న ప్రజలు.
ఎండాకాలం మొదలైందో లేదో వెంటనే కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మినహాయించి గ్రామాలు, మండలాలకు సైతం చీకటి పడితే చాలు కరెంటు కోతలు మొదలై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఎండలు పైగా ఉక్కపోత తో విసిగి పోతున్న ప్రజలకు ప్రతిరోజు సాయంత్రం మరియు రాత్రివేళల్లో సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా కరెంటు కోత తో సమస్యగా మారింది.
చిట్వేలు మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో పిల్లలలో ఒత్తిడి,తల్లిదండ్రుల లో ఆందోళన మొదలైంది. కరెంటు కోతలతో వ్యాపార సముదాయాలు ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే సదరు కంపెనీలకు పనిచేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత అధికారులు,ప్రతినిధులు స్పందించి కరెంటు కోతల సమయాన్ని మార్పు చేయడం లేక అధిగమించడం ద్వారా ప్రజలు ఇబ్బందుల నుంచి బయట పడతామని చిట్వేలు మండలం వ్యాప్తంగా ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.
Comments