వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉండి 3378 కోట్లు అభివృద్ధి జరిగింది అని అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదని, వేయి కోట్లు ఇళ్ళ నిర్మాణానికి కేటాయించామని చెప్పగా ఏ ఒక్కరికీ ఇంటి తాళాలు ఇవ్వకపోగా వేయి కోట్లు స్వాహా చేసారని టిడిపి ఇంఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. సంక్షేమం పేరుతో ప్రజలకు వచ్చిన డబ్బును కూడా తాను తెచ్చినట్లు చెప్పటం హాస్యాస్పదం అని, అభివృద్ధికి 1024 కోట్లు తెచ్చాను అని చెప్పే ఎమ్మెల్యే నిధులు కేంద్రం అలాగే రాష్ట్రం నుండి వస్తాయని ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు. అభివృద్ధి ప్రొద్దుటూరులో జరిగింది వాస్తవమే కానీ ఎమ్మెల్యే అతని బావమరిది మాత్రమే అభివృద్ధి చెందారని ఏద్దేవా చేశారు. వేయి కొట్లు ఉంటే వరదను కామనూరు కు పరిమితం చేస్తాను అన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలను ప్రవీణ్ తప్పుబట్టారు. కార్యకర్తలు అంటే ఎమ్మెల్యే కి విలువ లేదని అన్నారు. కేంద్రం జల్ జీవన్ క్రింద రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఒక కొలాయి కనెక్షన్ తీసుకోలేదని, స్టీల్ ప్లాంట్ పెట్టటానికి కడప అనువైన ప్రదేశం కాదని కేంద్ర మంత్రి వెల్లడించగా, పై వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు.
ప్రొద్దుటూరులో ఒక్క పరిశ్రమ అభివృద్ధి చెందక పోగా, సమస్యలు ఎక్కువయ్యాయని, కంటికి కనపడని అభివృద్ధి ప్రజలకు ఎమ్మెల్యే చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హోమ్ మంత్రి చే రాచమల్లు వారి రాజన్న భోజనం ప్రారంభించగా పరిసర నియోజకవర్గాల ఎమ్మెల్యే లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బహిరంగ సభలో టిడిపి వారిని దుర్భాషలు ఆడటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. రాజన్న భోజనం ప్రారంభానికి ఎంపీ అవినాష్ రెడ్డి రాకపోవటం బీటలు వారుతున్న ఎమ్మెల్యే కోటకు నిదర్శనం ఆని పేర్కొన్నారు. తాళ్ళమాపురం భూముల్లో కల్వరి టెంపుల్ నిర్మాణం ప్రారంభించగా ప్రొద్దుటూరు పాస్టర్స్ ని వారి సమస్య ఏమిటని ఎమ్మెల్యే ఒక్క మాట కూడా అడుగలేదు అని అన్నారు. పేద ప్రజల భూములు లాక్కొని చర్చ నిర్మాణం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసం అని, ఇకపై టిడిపి నాయకులను తప్పుగా మాట్లాడటం మానుకోవాలని కాదని హెచ్చరించారు.
Comentarios