పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. ఆర్ధికశాఖ అధికారులతో మధ్యాహ్నం 2.30 గంటలకు ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. ఆర్ధికశాఖ నుంచి ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. కేవలం ఆర్దిక శాఖ అధికారులతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయటం ద్వారా కొంతలో కొంత క్లారిటీ రానుందని తెలుస్తోంది. 1600 కోట్ల రూపాయల బకాయిలు, పీఆర్సీ ఫిట్ మెంట్ పైన అధికారులు క్లారిటీ తీసుకోనున్నారు. మొత్తం 16 సంఘాల నేతలకు ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితిని వివరిస్తూ 27 శాతం ఐఆర్ ఇస్తున్న నేపథ్యంలో అంతకంటే కొంత పెంచి ఫిట్ మెంట్ గా ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల ముందు వివరించనుంది ప్రభుత్వం.
top of page
bottom of page
Comentarios