వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
బాలికలే భవిష్యత్తు శక్తి భారతమాతకు మరో రూపం అని, భావి భారతం బాలికల చేతుల్లో ఉందిని, బాలికలు లేకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని, బాలికల సంరక్షణతో పాటు ఆడ పిల్లలపై వివక్షత లేని దేశంగా భారతదేశంగా వెలుగొందాలని ఆశిద్దాం అందుకు కృషి చేద్దాం, అని ప్రేరణ కుమార్ ఐపీఎస్ పేర్కొన్నారు.
ప్రొద్దుటూరు పట్టణంలోని గీతాశ్రమం నందు మంగళవారం ఉదయం లోకాసమస్థా మానవ హక్కుల సంఘం వారు ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథిగా ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి ప్రేరణా కుమార్ ఐపీఎస్ పాల్గొనగా, కడప పట్టణంలో పది రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్ నూరి పారి, వెటర్నరీ డాక్టర్ దస్తగిరమ్మ, మూడవ పట్టణ ఎస్.ఐ కృష్ణంరాజు నాయక్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాస రచనలు, వకృత్వపు పోటీలు బాలికలను ఆకట్టుకున్నాయి. మూడవ పట్టణ ఎస్సై నాయక్ మాట్లాడుతూ, బాలికలు ముందుగా తమ హక్కులను తెలుసుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్ వినియోగం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, బాలికల పట్ల అసభ్యంగా ఎవరు ప్రవర్తించిన యాప్ ద్వారా సమాచారం అందిన నిమిషాలలో తాము తమ సిబ్బంది అక్కడికి వచ్చి తగు న్యాయం చేస్తామని, ముందుగా పిల్లలు సామాజిక మాధ్యమాలకు కాస్త దూరంగా ఉంటూ చదువు పట్ల శ్రద్ధ చూపుతూ ఉన్నత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన హితువు పలికారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ బాలికలు అటు చదువుల పట్ల, ఇటు ఆటల పట్ల ఆసక్తిని కనపరుస్తూ, వారికి ఇష్టమైన రంగాలలో రాణించాలని, అప్పుడే బాలికలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని, సమన్యాయం సమధర్మం, వివక్ష లేని భారతావని సృష్టించాలని, సమాజంలో చెడుపోకడలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అత్యాచారాలు చేసి పాసవికంగా హింసిస్తున్నారని, అలాంటి నేపథ్యంలో 2012 అక్టోబర్ 11వ తేదీని అంతర్జాతీయ బాలికల దినోత్సవం గా గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలికలకు తమ హక్కులను తెలిపి, పురుషులతో పాటు సమాన హోదాను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో శారద జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థినులు కీర్తన, రూపశ్రీ, ప్రియదర్శినిలు విజేతలుగా నిలిచారు.
లోక సమస్త మానవ హక్కుల సంఘం ఫౌండర్ అండ్ చైర్మన్ పి నరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఆ సంస్థ సభ్యులు కడప జిల్లా అధ్యక్షుడు పామిడి వీరయ్య యాదవ్, జిల్లా మహిళా విభాగ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, సెక్రెటరీ వెంకట్ యాదవ్, కడప పట్టణ మహిళా విభాగ అధ్యక్షురాలు ఏ లక్ష్మీ భవాని, జిల్లా మహిళా విభాగ జనరల్ సెక్రెటరీ బి సుధామణి, బాల సరస్వతి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ఏ బాలాజీ, శ్రవణ్ కుమార్, దస్తగిరి, మాభాష, పలు కళాశాలల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments