చుక్కారామయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు- రిమాండ్ కు తరలింపు -మిగిలిన వారి కోసం గాలింపు.
ఈనెల 11వ తారీఖున చిట్వేలి మండలం గట్టుమీద పల్లె గ్రామానికి చెందిన చుక్కా రామయ్య హత్యకు కారణమైన ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ విధంగా వివరాలను తెలిపారు. స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు తో కలిసి రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ...
సరిగ్గా ఒక నెల క్రితం రైల్వేకోడూరు మండలం గంగరాజుపురం గ్రామానికి చెందిన ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం రాజు,తన కుమార్తె ఉప్పలపాటి వరలక్ష్మి ఆత్మహత్యకు చుక్కారామయ్య చేసిన భూతవైద్యమే కారణమని నమ్మి అతనిపై కక్షగట్టి; కోడూరు రహదారిలోని సిద్ధారెడ్డి పల్లి గ్రామ సమీపంలో కుటుంబ కలసి టీవీఎస్ ఎక్సెల్ వాహనం మీద ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్న చుక్కా రామయ్యను స్కార్పియో వాహనంతో గుద్ధి,కంట్లో కారంపొడి చెల్లి, క్రికెట్ వికెట్లతో తలపై గాయపరిచి, తరువాత పదునైన కత్తితో ముగ్గురు కిరాయి వ్యక్తులతో కలిసి చుక్కా రామయ్యను గొంతు కోయడం జరిగిందని, అంతట చుక్కా రామయ్యను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారని అన్నారు.మృతిని భార్య వెంకటసుబ్బమ్మ ఫిర్యాదు మేరకు వివరాల నమోదు చేసుకుని హత్య కేసు ను దర్యాప్తు చేయు క్రమంలో..
బుధవారం రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ విశ్వనాథరెడ్డి ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట క్రాస్ వద్ద ఖచ్చితమైన సమాచారంతో ముద్దాయి అయిన ఉప్పలపాటి సుబ్రహ్మణ్యం రాజును(44) అరెస్టు చేసి; అతని వద్ద నుంచి స్కార్పియో వాహనాన్ని,హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీన పరుచుకుని సీజ్ చేసి గురువారం రిమాండ్ కు పంపుతున్నామని అన్నారు. మిగిలిన కిరాయి నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చేస్తున్నామని తెలిపారు. హత్య కేసును చేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన చిట్వేల్ ఎస్సై వెంకటేశ్వర్లను, సిబ్బందిని సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. "జబ్బు వైద్యానికే తప్ప మంత్రాలకు తగ్గదని" ప్రపంచ దేశాలతో పోటీపడి ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి, ప్రజలు ఎవ్వరు మోసపోవద్దని మంత్రాలు తంత్రాలు ఏవి లేవని, మా దృష్టికి తీసుకొస్తే అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు.
Comentarios