వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు డీయస్పీ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా డీయస్పీ ప్రసాద్ రావు మాట్లాడుతూ, పట్టణంలో గత కొద్ధి రోజుల క్రితం 'టిప్పు సుల్తాన్ సెంటర్' పేరుతో మైదుకూరు రోడ్డులోని డివైడర్ పై కొందరు అజ్ఞాత వ్యక్తులు వీధి పేరు వ్రాసారని, సంబంధిత అధికారుల అనుమతులు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకొన్నామని, కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయటం జరిగిందని, ఇకపై ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, LHMS (లాక్డ్ హౌస్ మోనిటరింగ్ సిస్టం) ను ప్రొద్దుటూరు ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు, వేసవి కాలం కావటం చేత ప్రజలు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ఏదయినా పని నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ నందు సంప్రదించి LHMS ద్వారా దొంగతనాలు జరగకుండా రక్షణ పొందగలరని కోరారు.
Comentários