వై.ఎస్.ఆర్ కడప జిల్లా, APSRTC ప్రొద్దుటూరు డిపోకు చెందిన AP 39Z 0163 ప్రొద్దుటూరు నుండి బెంగళూరు వెళ్లే బస్సు మధ్యాహ్నం డిపో నుండి బయలుదేరి వెళ్లగా మార్గమధ్యంలోని మదనపల్లెకు చేరుకుంది, అక్కడ ఆర్మీ పేరు రాసి ఉన్న సుజికి FZ AP 03 CQ 8635 ద్విచక్రవాహనములో మద్యం సేవించి ఉన్న ఇద్దరు వ్యక్తులు బస్సు ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ ద్విచక్ర వాహనానికి అడుగడుగునా బ్రేకులు వేస్తూ, అటు బస్సు డ్రైవర్ కి ఇటు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారని, ఇదేమిటని ప్రశ్నించిన బస్సు డ్రైవర్ ని దుర్భాషలాడుతూ, కాస్త దూరం వెళ్ళగానే మరో వ్యక్తి వీరితో జతకూడి మార్గ మధ్యంలో బస్సును ఆపి తాళాలు తీసుకుని, డ్రైవర్ పై భౌతిక దాడికి పాల్పడ్డారు. బస్సులోని ప్రయాణికులు కలుగచేసుకొని వారిని వారించే ప్రయత్నం చేయగా మరింత రెచ్చిపోయారని, డ్రైవర్ దగ్గర మరో తాళం ఉండటం వలన మదనపల్లి డిపో ఎదురుగానే పోలీసుస్టేషన్ లో డ్రైవర్ ప్రయాణికులు బస్సు తో సహా అక్కడికి వెళ్లి జరిగిన సంఘటన పోలీసులకు తెలియచేయగా, హుటాహుటిన పోలీసులు దాడికి పాల్పడ్డ వారిని స్టేషన్ కు తీసుకురాగా, మదనపల్లి APSRTC డిపో మేనేజర్ కలుగుచేసుకొని ఎటువంటి కేసులు లేకుండా, ప్రయాణికుల సమక్షంలో డ్రైవర్ కి క్షమాపణ చెప్పించారని. రాత్రి తిరుగు ప్రయాణంలో బెంగుళూరు నుండి ప్రొద్దుటూరుకు టిక్కెట్లు బుకింగ్ కాగా, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొద్దుటూరు డిపో మేనేజర్ తెలిపారు.
దాడి దృశ్యాలు :
Comentarios