ఆటో యూనియన్ కార్మికులు టిడిపి వైపు మొగ్గు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలో టిడిపి నాయకత్వాన్ని బలపరుస్తూ, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఐదవ వార్డ్ కౌన్సిలర్ వంగనూరు మురళిధర్ రెడ్డి, రాజుపాలెం మాజీ జెడ్పిటిసి వెళ్లాల భాస్కర్ ల ఆధ్వర్యంలో ది ప్రొద్దుటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు బుధవారం మధ్యాహ్నం తమ పూర్తి మద్దతు, సహాయ సహకారాలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి, అలాగే కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డికి తెలియజేస్తూ స్థానిక పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ భీమగుండం చండ్రాయుడు తో పాటు దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు, కార్మికులు, వారి కుటుంబాలు వరద సమక్షంలో టిడిపి లో చేరారు.
ఈ సందర్భంగా చండ్రాయుడు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం హయాంలో ఆటో డ్రైవర్లకు మొండి చేయి మిగిలిందని, పెరిగిన డీజిల్ పెట్రోల్ రేట్లతో సతమతమవుతూ దుర్భర జీవితాలు గడిపామని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులలో అటు రాష్ట్రంలోనూ, ఇటు నియోజకవర్గంలోనూ టిడిపి అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని, రానున్న ఎన్నికలలో టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగిన వరదకు తమ యూనియన్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందించి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవలసిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం పగ్గాలు చేపడితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
అనంతరం టిడిపి అభ్యర్థి వరద మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకొని టిడిపిని అధికారంలోకి తేవలసిన అవసరం ఆవశ్యకత ప్రతి ఓటరుకు ఉందని, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలలో ఏపీ ఒకటి అని, ఆటో డ్రైవర్లు కార్మికుల సమస్యలు తీర్చడానికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, అధికారులతో, ప్రభుత్వంతో చర్చించి వారి డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇస్తూ, తాను తుది శ్వాస వరకు నిజాయితీ గానే బ్రతుకుతానని హితవు పలికారు. కార్యక్రమంలో వి ఎస్ ముక్తియార్, ఈవి సుధాకర్ రెడ్డి, చల్ల రాజగోపాల్ యాదవ్, నల్లబోతుల నాగరాజు, జనసేన నాయకులు జిలాన్ తదితరులు పాల్గొన్నారు. టిడిపి కండువా తప్పుకున్న యూనియన్ ముఖ్య నాయకులు గురుమూర్తి, దేవదాసు, జయరామిరెడ్డి, బాబు, వెంకటపతి, వెంకటరాయుడు, ప్రసాద్ రెడ్డి, రామాంజనేయులు, వెంకటేశ్, చెన్నకేశవ, రెహమాన్, అల్లాబకాష్, చోటు తదితరులు ఉన్నారు.
Comments