వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణ బలిజ సంఘం వారి ఆధ్వర్యంలో నేడు బలిజ సంఘీయుల కార్యాలయం నందు ప్రముఖ న్యాయవాది ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ కౌన్సిల్ అధ్యక్షులు పూల రామ గుర్రప్ప ను సన్మానించారు. గత సంవత్సర కాలంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించి నేడు పదవీ కాలం ముగియటం చేత బలిజ సంఘీయులు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని సంఘ ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయి రామ గుర్రప్ప సేవలను కొనియాడారు.
ఈ సందర్బంగా రామ గుర్రప్ప మాట్లాడుతూ ముందుగా బలిజ సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలియచేసారు, తాను ప్రొద్దుటూరు వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి ఇప్పటికి 33 సంవత్సరాలు అయ్యిందని, నాటి నుండి నేటి వరకు కుల పెద్దలు తనను అడుగడునా ప్రోత్సహిస్తున్నారని, వారు తనపై చూపిన ఆదరాభిమానాలకు ఎల్లవేళలా కృతజ్ఞుడనని, ఈరోజు తనకు బలిజ సంఘం తరుపున జరిగిన సన్మానాన్ని ఎన్నటికీ మరువనని, రాబోవు రోజుల్లో తాను ఎప్పటిలాగే బలిజ సంఘానికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని తెలియచేసారు. ప్రొద్దుటూరు బలిజ సంఘం గౌరవాధ్యక్షులు శింగంశెట్టి గుమ్మటమయ్య మాట్లాడుతూ రామ గురప్ప సేవలను కొనియాడారు, ప్రస్తుత తరుణంలో పేదలకు బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్లటానికి ఆర్ధిక స్థోమత లేని వారికి రామ గురప్ప వృత్తి పరంగా వారి తరపున పోరాడి వారికి కోర్టు ద్వారా తగు న్యాయం జరిగేలా చేసాడని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు బలిజ సంఘం గౌరవాధ్యక్షులు శింగంశెట్టి గుమ్మటమయ్య, గౌరవాధ్యక్షులు కంసాల నరసింహులు, అధ్యక్షులు మంచి రాజా, కార్యదర్శి బుక్కపట్నం జయ శంకర్, కోశాధికారి టంకశాల సుధాకర్, ఉపాధ్యక్షులు మలిశెట్టి కొండన్న, ఘంటశాల వెంకటేశ్వర్లు, తుపాకుల చంద్ర మౌళి, ప్రచార కార్యాదర్శి కోనేటి నరేంద్ర, కమిటీ సభ్యులు పిడుగు నాగేశ్వర రావు, ముత్యాల చిన్న మునెయ్య, గడ్డం చెలపతి, తోట చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments