వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు, హోసింగ్ బోర్డు కాలనీ కూడలి వద్ద వెలసిన పెద్దమ్మ తల్లి (చెట్టు) ఆలయాన్ని నేడు బీజేపీ నాయకులు సందర్శించి పూజలు నిర్వహించారు, అనంతరం వై.ఎస్.ఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పట్టణ ఇంచార్జి గొర్రె శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు, పెద్దమ్మ తల్లి హిందువుల ఆరాధ్య దైవం అని, మత విస్వాసాలతో ఇక్కడ హిందువులు పూజలు నిర్వహిస్తారని, ఇక్కడ వెలసిన ఆలయానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు అయి ఉందని, వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని గుర్తు చేశారు. అయితే, రంజాన్ మాసం ఆరంభం నాడు ఇక్కడ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని, ఆలయ ప్రాంగణం లేదా పరిధిలో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఫ్లెక్సీని తీసివేయాలని బీజేపీ నాయకులను ఇక్కడి నివాస ప్రజలు కోరారని, రురల్ పోలీసు వారికి విషయం తెలుపగా వారు ఫ్లెక్సీ తీసివేయిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల నాడు కూడా ఇక్కడ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చిందని, కాగా నేడు బీజేపీ నేతలు ఆలయ సందర్శనకు వస్తున్నారని తెలిసి, నేటి ఉదయం ఫ్లెక్సీని తొలగించారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టరాదని, మాత సామరస్యానికి ప్రతీకగా నిలిచి హిందువుల మనోభావాలను కాపాడాలని అభిప్రాయపడ్డారు. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గొర్రె శ్రీనివాసులు, పట్టణాధ్యక్షుడు పి. సుబ్రహ్మణ్యం, మండల ఉపాధ్యక్షుడు నరసింహ ప్రసాద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments