top of page
Writer's picturePRASANNA ANDHRA

బస్టాండ్ పునరుద్ధరణ, నూతన నిర్మాణం కొరకు భూమి పూజ

బస్టాండ్ పునరుద్ధరణ నూతన నిర్మాణం కొరకు భూమి పూజ

వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు


సోమవారం ఉదయం స్థానిక మైదుకూరు రోడ్డు లోని కొత్త బస్టాండ్ నూతన హంగులతో నిర్మించడానికి భూమి పూజ నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి, ఆర్టీసీ డిఎం తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, నూతన బస్టాండ్ నిర్మాణం నాలుగున్నర కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్నామని, స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు కృషి వల్లే ఇది సాధ్యమైందని, మూడున్నర ఎకరాలలో విస్తరించిన నూతన బస్టాండ్ నందు రాబోవు రోజుల్లో ప్రైవేట్ నిర్మాణాలకు 33 సంవత్సరాల లీజ్ కాంటాక్ట్ పద్ధతిలో, అద్దె వసూలు చేసేలా నిర్మాణాలు చేపట్టదల్చామని, ఇందువలన ఆర్టీసీకి ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. దాదాపు 12 ప్లాట్ఫార్ములు నిర్మించనున్నామని అయితే ఇందులో ఎక్స్ప్రెస్ సర్వీసులకు పల్లె వెలుగు బస్సులకు ప్రత్యేకంగా మరికొన్ని ప్లాట్ఫార్మ్ లు నిర్మిస్తామని రాష్ట్రస్థాయిలో ప్రొద్దుటూరు కంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా ప్రొద్దుటూరు కే తలమానికం అయ్యేలా, ఈ నూతన నిర్మాణం చేపడుతున్నామని, బస్టాండ్ నందు ప్రయాణికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నామని ఆయన అన్నారు.

అనంతరం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నూతన బస్టాండ్ నిర్మాణం ప్రొద్దుటూరు అభివృద్ధికి తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు. గత పాలకుల హయాంలో అభివృద్ధి కి నోచుకోని ప్రొద్దుటూరు నియోజకవర్గం నేటి నూతన బస్టాండ్ నిర్మాణం చేపడుతుండగా ఇది ప్రతిపక్షాలు ఓర్వలేక ఉన్నాయని, 30 సంవత్సరాల లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కొత్త బస్టాండ్ ను పునర్ నిర్మించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, జగన్ హయాంలోని అభివృద్ధికి పెద్దపీట వేశామని, నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, నూతన కాలువల నిర్మాణం, పూడికతీత పనులు, 70 సంవత్సరాల నాటి మంచినీటి పైప్లైన్ స్థానంలో నూతన పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఒక సంవత్సరంలోపు నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ ఏ. మల్లికార్జున రెడ్డి సహాయ సహకారాలతోనే బస్టాండ్ ఆధునీకరణ పనులు సాధ్యమయ్యాయని కితాభిచారు. ప్రజలకు ఇచ్చిన మాట జగన్ సర్కార్ నిలబెట్టుకుందని ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో రాబోవు రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నామని ఆయన తెలిపారు.


కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, ఆర్టీసీ డిపో ప్రొద్దుటూరు డీఎం, ఆర్టిసి కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

69 views0 comments

留言

評等為 0(最高為 5 顆星)。
暫無評等

新增評等
bottom of page