జంతు మృత కళేబరాల ఆవాసాలుగా ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
జంతు మృత కళేబరాల ఆవాసాలుగా ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్లు మారింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదనే చెప్పాలి. గోపవరం పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ బైపాస్ రోడ్డు నందు జంతువుల మృత కళేబరాలలో ముఖ్యంగా పందులు, కుక్కలు, ఎనుములు చనిపోయిన వెంటనే ఇక్కడ తెచ్చి పడేయటం ఇక్కడి ప్రజలకు ఆనవాయితీగా మారిపోవడంతో పదుల సంఖ్యలో జంతువుల మృతదేహాలు ఇక్కడ పడి ఉండటం, కుక్కలు గ్రద్దలు వీటి కళేబరాలను పీక్కు తింటుండగా... కాలానుగుణంగా ఇవి కుళ్లిపోయి అటుగా వెళ్తున్న వారికి ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధాన్ని వెదజల్లుతూ తీవ్ర ఇబ్బందికి గురి చేయటం ఒక సమస్య కాగా... ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం వలన గాలి కలుషితమై రోగాలు వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు... ఏది ఏమైనా అటు ప్రజలు ఇటు పంచాయతీ సిబ్బంది వీటిని పూడ్చటమైనా చేయాలి. మరీ ముఖ్యంగా రురల్ పోలీసు స్టేషన్ నుండి బైపాసుకు వెళ్లే దారిలో జంతు మృత కళేబరాలతో పాటుగా కోళ్ల వ్యర్ధాలు ఇక్కడే పదివేయటం వలన దుర్గంధంతో పాటు గాలి కాలుష్యం, ఈదురుగాలులు వీచినపుడు కోళ్ల వ్యర్ధాలయిన వాటి ఈకలు వాహనదారుల మీద పడటం చేత వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అటుగా వెళ్తున్న వాహనదారులు కోరుతున్నారు. ప్రజలు కూడా చనిపోయిన వారి జంతువులను ఇలా రోడ్డుకు ఇరువైపులా పడివేయటం సబబు కాదని గమనించి, ఇలాంటి దుర్వాసనే వారి నివాసాల ముంగిటానో లేక వారి వీధిలోనో వస్తే పరిస్థితి ఏమిటని గుర్తెరిగి ఆలోచించి ఇకనైనా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.
Comments