ఘనంగా ప్రారంభం కానున్న దసరా ఉత్సవాలు - ఆర్యవైశ్య సభ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో 134వ దసరా ఉత్సవాలు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుశెట్టి రామ్ మోహన్ రావు తెలిపారు. అక్టోబర్ మూడవ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలలో పాలకొల్లు బ్యాండ్ సెట్, కుత్బుల్లాపూర్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు, అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఉత్సవాలలో చివరి రోజైన విజయదశమి పర్వదినం నాడు హర్యానా వారి భంభం బోలే, శక్తి స్వరూపం, కేరళ సింగారి మేళా తాళాల చే అమ్మవారిని సెమీ దర్శనం బయలుదేరుతుందని, ఏడవ తేదీ, 9వ తేదీ, 10వ తేదీలలో విశేష అభిషేకాలు, హోమాలు, సుహాసిని పూజలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం కడప జిల్లా కళా చారిత్రక సాంస్కృతిక వారసత్వ మాస పత్రిక 'మన చరిత' ను ఆవిష్కరించారు. సమావేశంలో ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సభ్యులు పాల్గొన్నారు.
Comments