వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక బొల్లవరం IMA హాలు నందు నేడు పట్టణములోని డాక్టర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి పట్టణములోని డాక్టర్లు హాజరు కాగా, డా. వై. పద్మలత అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కాగా గత రెండు రోజుల క్రితం రాజస్థాన్ లో మరణించిన డాక్టర్ అర్చన శర్మ ఆత్మహత్య నేపథ్యంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు, అయితే కనీసం డాక్టర్ అర్చన శర్మ చిత్రపటం పెట్టి ఆమె ఆత్మ శాంతి కోసం కనీసం రెండు నిమిషాలు మౌనం పాటించలేదు ఇక్కడి సమావేశానికి హాజరయిన డాక్టర్లు.
ఇక వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఓ ప్రైవేట్ ఫెసిలిటీలో గర్భిణి మృతికి కారణమైన మహిళా వైద్యురాలు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. డాక్టర్ అర్చన శర్మ, ఆమె భర్తలు నిర్వహిస్తున్న ఆసుపత్రిలో గర్భిణి మంగళవారం మృతి చెందింది. గర్భిణి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వెలుపల నీరసన ప్రదర్శన నిర్వహించి, తప్పు చేసిన వైద్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో లాల్సోట్ పోలీస్ స్టేషన్‌లో అర్చనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు పై ఒత్తిడికి లోనయిన అర్చన ఉరి వేసుకుని చనిపోయిందని పోలీసులు తెలిపారు. డాక్టర్ అర్చన శర్మపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేయబడింది.
ఈ సందర్భంగా డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ డాక్టర్లు ఎవరు తమ పేషెంట్ ని ఉద్దేశపూర్వకంగా చంపాలి అనుకోరని, 302 కేసు నమోదు చేయటం దారుణమని, ఇది సబబు కాదని, భవిష్యత్తులో ఇలాగయితే డాక్టర్లు తమ ప్రాక్టీస్ చేయలేరని ఆవేదన వ్యక్తపరిచారు. డా. సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఇది దురదృష్టకర సంఘటన అని, దేశం ఒక మంచి డాక్టర్ని కోల్పోయిందని, ఏది ఏమయినా ఆత్మహత్య చేసుకోవటం తప్పని తెలిపారు. డా. వరలక్ష్మి మాట్లాడుతూ పై సంఘటన లో డాక్టర్ అర్చన శర్మ ఆత్మహత్య చేసుకోవడం తప్పని, డాక్టర్లు నిరాధరణకు గురి అవుతున్నారని, ఆత్మహత్యలకు పాల్పడటం తప్పు అని హితువు పలికారు. డా. రాజా రామ్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్లు దేవుళ్ళు కాదని, అవమాన భారం భరించలేకనే అర్చన శర్మ ఆత్మహత్యకు పాల్పడిందని తాను భావిస్తున్నానని తెలిపారు.
కాగా, ఇందులో కొసమెరుపుగా డా. పద్మలత, ఎక్కడో రాజస్థాన్ లో జరిగిన సంఘటనకు ఇక్కడి మీడియా మిత్రులపై అక్కసు వెళ్లగక్కారు. సుబ్బి గాడి పెళ్లి ఎంకి చావుకు వచ్చింది అన్న చందంగా.
Comments