పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిన మున్సిపల్ కౌన్సిల్
ప్రొద్దుటూరు పురపాలక సంఘ సాధారణ సమావేశం శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ భవనం నందు జరిగినది. ఈ సభలో 31 అభివృద్ధి అంశాల అజెండా పై సభ్యులు సమీక్ష నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందులో అన్ని బిసెంట్ మున్సిపల్ హై స్కూల్ మైదానం నందు ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్ నెలలో 45 రోజులపాటు ఎగ్జిబిషన్ నిర్వహించడం బహిరంగ వేలం ద్వారా హెచ్ పాటదారునికి లీజునకు ప్రొద్దుటూరు పురపాలక సంఘం వారు కేటాయిస్తున్నారు.
ప్రస్తుతం 2022 సంవత్సరం సెప్టెంబర్ నెలలో దేవీ నవరాత్రుల ప్రారంభం రోజున ఎగ్జిబిషన్ ప్రారంభం ఉన్నందున, బహిరంగ వేలం ద్వారా ముందు చెల్లించవలసిన ధరావత్ పది లక్షల నుండి 20 లక్షల వరకు నిర్ణయించుటకు మరియు బహిరంగ వేలం నందు సంఘ పరిధిలో గల ఏ ప్రైవేట్ స్థలంలోనైనా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకొనుటకు ఐదు లక్షలు పురపాలక సంఘమునకు చెల్లించిన యెడల నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయబడు అంశము కౌన్సిల్ ఆమోదించబడినది.
ఈ సమావేశంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ వార్డులో బ్యాచింగ్ వర్కులు జరుపుటకు తనను సంప్రదించలేదని అన్నారు. ఇందుకు కఅధికారులు సమాధానం ఇస్తూ ఇకమీదట కౌన్సిలర్ను సంప్రదించి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా, కమిషనర్ వెంకట రమణయ్య మరియు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.
Opmerkingen