కడప జిల్లా, ప్రొద్దుటూరు
మానవహారం నిర్వహించి, రెండు నిమిషాలు మౌనం పాటించిన పోలీసు శాఖ అధికారులు, ఎన్.సి.సి విద్యార్థులు.
విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం - ఏఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్.
దేశ, రాష్ట్ర శాంతి భద్రతల పరిరక్షణలో (01.09.2021 నుండి 31.08.2022) ప్రాణ త్యాగాలు చేసిన 261 మంది పోలీసులకు ఘన నివాళి అర్పించిన ప్రొద్దుటూరు పోలీసు శాఖ. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన భాద్యత అని, వారు చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని ట్రాఫిక్ సిఐ యుగంధర్ అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం స్ధానిక ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేరణా కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పట్టణంలోని పోలీసు అధికారులు, ఆర్ట్స్ కాలేజ్, శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల, గౌరీ శంకర్ కాలేజ్ ఎన్.సి.సి విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రతి ఏడాది అక్టోబర్ 21 న పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకుంటారని, 1959వ.సంవత్సరం అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన పోలీసు శాఖ ధైర్యా సాహసాలను, త్యాగాన్ని అమరవీరుల స్మారక దినంగా భారతదేశం గత 62 ఏళ్లుగా గుర్తుచేసుకుంటుందన్నారు. నాటి నుండి నేటి వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసు, ప్రతి పోలీసు కుటుంబానికి మొత్తం సమాజం జే జే లు పలుకుతుందన్నారు. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 261 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 08 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని గుర్తు చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఎల్లవేళల అండగా ఉండి పిల్లల చదువులకు అవసరమైన ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.
Comments