వినాయకచవితి సందర్భంగా పోలీసు అధికారుల సూచనలు
పట్టణ పరిధిలోని రెండవ, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో నందు గురువారం సాయంత్రం రానున్న వినాయకచవితి పండుగ అలాగే గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ప్రొద్దుటూరు పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని సూచనలు సలహాలు తెలియజేశారు. తగు జాగ్రత్తలు తీసుకొని పండుగను జరుపుకోవాలని తెలియజేస్తూ, పట్టణ ప్రజలకు ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
పోలీసు అధికారుల సూచనలు :
1. వినాయక విగ్రహాలు నిలుపడానికి (కమిటీ) తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలి.
2. విగ్రహాలు నిలువడానికి వివాదాస్పద స్థలాలు, ట్రాఫిక్ అంతరాయం కలిగించు విధముగా ఉండే స్థలాలను
3. వినాయక విగ్రహాలకు నిర్వహకులే తగిన భద్రత (24 గంటలు) కల్పించుకొనవలయును.
4. తప్పనిసరిగా నలుగురికి తక్కువ కాకుండా విగ్రహ రక్షణ కొరకు ఉండవలయును. బలవంతపు వసూళ్లకు పాల్పడకూడదు. అట్టివారిపై కఠిన చర్యలు తీసుకొనబడును.
5. వినాయక విగ్రహాల వద్దగాని, లేదా నిమర్జనం రోజున గాని ఎలాంటి డ్యాన్స్ ప్రోగ్రాములు. నిర్వహించకూడదు.
6. వినాయక విగ్రహాల వద్ద గాని, నిమర్జనం రోజున గాని ఎలాంటి రంగులు ఇతరుల పై చల్లరాదు. టపాసులు కాల్చారాదు.
7. నిమర్జనం వీలైనంత వరకు చీకటి పడకముందే పూర్తి చేయవలెను.
8. నిమర్జననికి పోయేటపుడు ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకొనవలెను.
9. మైక్ ఉపయోగించే వారు మైక్ పర్మిషన్ తప్పకుండా తీసుకొనవలయును. పర్మిషన్ లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించవలేను.
10. విగ్రహాల వద్ద బాక్స్ టైప్ సౌండ్ బాక్సులను మాత్రమే వాడవలేయును. DJ సౌండ్ ఉపయోగించరాదు. మసీదుల సమీపములో విగ్రహ ప్రతిష్ట చేయువారు నమాజు జరుగు సంధర్భములలో సౌండు లేకుండా ఉంచవలయును.
11. విగ్రహాల వద్ద నిమజ్జనం ఊరేగింపు సమయం లో కొత్తవారు గాని, అనుమానిత వస్తువులు గాని ఉన్నచో వెంటనే సమీపం లో ఉన్న పోలీస్ అధికారులకు తెలియజేయవలెను.
12. వినాయక విగ్రహాల వద్ద మరియు నిమజ్జనం వెళ్ళేటప్పుడు భక్తులు మత్తుపానీయాలు సేవించి ఉండరాదు. ఇందుకు నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించి, తగు జాగ్రతలు తీసుకునవలెను.
13. వదంతులను తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. అవసరమైనచో వెంటనే పోలీసు వారిని సంప్రదించండి.
14. విగ్రహాల వద్ద పూజా మరియు ఇతర కార్యక్రమాలను రాత్రి 10 గంటల కల్లా పూర్తి చేసి ముగించవలెను.
15. విగ్రహ ప్రతిష్టకు P & B, మరియు విద్యుత్ శాఖ ఇంజనీర్లచే అనుమతి పత్రము తీసుకుని తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేసుకొనేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు. తీసుకొనవలెను.
16. బంగారు మరియు విలువైన ఆభరణములను ధరించి వచ్చు మహిళలకు తగు జాగ్రత్తలు తీసుకొమ్మని మరియు ఇంటికి తాళం వేసి అందరూ ఒకేసారి విగ్రహాల వద్దకు రాకుండా, ఇంటిలో ఎవరినైనా ఉంచి రావలసినదిగా మైకు ద్వారా పదే, పదే భక్తులకు విజ్ఞప్తి చేసి మరియు విగ్రహ కమిటి వాలంటీర్లను బంగారు ఆభరణాలను ధరించివచ్చు మహిళలపై నిఘా ఉంచి, ఎలాంటి దొంగతనాలు జరుగకుండా చూడవలయును. ఆడ దొంగలు ఉన్నారు కాబట్టి ఈ విషయమై భక్తులకు తగు సూచనలు ఇవ్వవలయును.
17. విగ్రహాల వద్ద నోట్ బుక్ (పాయింట్ బుక్) తప్పక ఉండవలయును. పోలీసు వారు తనిఖీకి వచ్చినప్పుడు. IN నోట్ బుక్ చూపించవలయును. బీటు పోలీసు వారు అందులో సంతకము చేయవలెను.
18. నిమజ్జనం రోజు, ఊరేగింపుకు వాడే వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకుని, వాహనాలు తనిఖీ అయిపోయిన తరువాత ఊరేగింపు మొదలు పెట్టవలెను.
19. నిమజ్జనం రోజు, చిన్నపిల్లలను నిమర్జనం జరిగే ప్రదేశమునకు తీసుకొని రాకూడదు. నిర్వాహకులు: ప్రమాదములు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
20. వినాయక విగ్రహము పెట్టిన వాహనము నడుపు డ్రైవర్ ఎటువంటి పరిస్థితులలో మద్యము సేవించరాదు మరియు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండవలయును.
21. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే మంటపం వద్ద, దగ్గరలోని ముఖ్య కూడళ్ళ వద్ద, మరియు నిమజ్జనం చేయు ప్రదేశములలో సి.సి కేమరాలు ఏర్పాటు చేసుకోవాలి.
22. వినాయక విగ్రహాల వద్ద దీపములు వెలిగించి వదిలేయడము వలన అగ్ని ప్రమాదము సంభవించు అవకాశము కలదు. కనుక మంటపములో దీపములు వెలిగించి అని పూర్తిగా ఆరి పోయే వరకు నిర్వాహకులు దగ్గర వుండవలెను.
23. వినాయక ఉత్సవ మండపముల వద్ద ఇసుక బకెట్లు, నీళ్ళ డ్రమ్ములు సిద్ధముగా ఉంచవలెను. దీని వలన ఏవైనా అగ్ని ప్రమాదము జరిగినచో వెంటనే ఆర్పివేయవచ్చును.
పై సూచనలను తప్పనిసరిగా పాటించి వినాయక చవితి పండుగ ఉత్సవములు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పోలీసు శాఖ అధికారులు కోరారు.
Comentarios