ప్రొద్దుటూరు పోలీసు వారి హెచ్చరిక
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రేపు అనగా జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆంక్షలు విధించినట్లు ప్రొద్దుటూరు పోలీసులు తెలిపారు. రేపు అనగా 04.06.2024 వ తేది 2024 జనరల్ ఎలెక్షన్ కౌంటింగ్ నేపధ్యంలో 144 Cr.P.C మరియు 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నదని, ఈ సందర్భంగా వారు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద అలాగే వ్యాపార సముదాయాల వద్ద పోలీసుల ఆంక్షలు ప్రజలకు వివరించారు. ఇందులో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతియుతంగా జరగటానికి ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఈరోజు అనగా మూడవ తేదీ రాత్రి సమయంలో మూతపడ్డ వ్యాపార సముదాయాలు ఐదవ తేదీ ఉదయాన మాత్రమే తిరిగి తెరవవలసి ఉంటుందని, అనవసరముగా రోడ్లపైకి ప్రజలు గుంపులు గుంపులుగా చేరుకోరాదని, ఆంక్షలు మీరిన నేపథ్యంలో వారిపై చర్యలు తప్పవని అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు, మెడికల్ షాపులు మాత్రమే తెరిచి ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comentarios