త్రైమాసికంలో పెరిగిన వడ్డి శాతం - ప్రొద్దుటూరు పోస్టల్ శాఖ
వై.వైస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రెండు రోజుల వ్యవధిలో పదకొండు లక్షల సుకన్య సమృద్ధి యోజన పధకాలను ఖాతాదారులకు అందించిన భారత తపాలా శాఖను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారని, సోమవారం ఉదయం సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్ కె.పీ రవి బాబు అధ్యక్షతన ప్రొద్దుటూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు గల ఆయన ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రవి బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ రవి బాబు మాట్లాడుతూ, భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ త్రైమాసికంలో వడ్డీ రేట్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గ విషయం అని, వడ్డీ రేట్ల పెరుగుదల వలన తమ ఖాతాదారులకు మరింత లబ్ది చేకూరనున్నట్లు, సవరించిన వడ్డీ రేట్లు జనవరి ఒకటవ తేదీ 2023 నుంచి అమలులోకి వచ్చాయని, ఇందుకు సంబంధించి ఒక్క సంవత్సరం నుండి అయిదు సంవత్సరాల వ్యవధి గల టైం డిపాజిట్లు, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ ఖాతాలు, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్రాల స్కీంలలో వడ్డీ రేట్లు పెరిగాయని తెలిపారు.
ఇకపోతే పది సంవత్సరాల లోపు వయసు గల బాలిక పేరు మీద తల్లిదండ్రులు లేదా చట్టబద్దమైన సంరక్షకుని ద్వారా సుకన్య సమృద్ధి యోజన పధకం బాలిక బంగారు భవిష్యత్తుకు సంపద పథకంగా ఆయన అభివర్ణిస్తూ రెండు వొందల యాబై రూపాయల కనిష్ట డిపాజిట్ నుండి ఈ పధకం ప్రారంభిచవచ్చునని తెలిపారు. అలాగే పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ లాంగ్ టర్మ్ సేవింగ్స్ స్కీం ద్వారా నివాస భారతీయుడైన వయోజనులు పిపిఎఫ్ అకౌంట్ తెరవటానికి అర్హులు అని, అలాగే మూడు వొందల తొంబై తొమ్మిది రూపాయల సంవత్సర ప్రీమియం చెల్లించిన యెడల పది లక్షల రూపాయల గ్రూప్ ఆక్సిడెంట్ గార్డ్ పాలసీ (ప్రమాద భీమా) తీసుకునే వెసులుబాటు తపాలా శాఖ అందిస్తోందని ఇందుకుగాను పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి అరవై అయిదు సంవత్సరాల వారు అందరు అర్హులే అని పేర్కొన్నారు.
బ్యాంకులకు ధీటుగా స్థానిక తపాలా శాఖలు పలు సేవలు అందిస్తున్నాయని వాటిలో రికరింగ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజెన్ పొదుపు ఖాతా గరిష్ట పరిమితి పదిహేను లక్షల నుండి ముప్పై లక్షలకు పెంచి , ఎంఐఎస్ సింగల్ డిపాజిట్ గరిష్టంగా 4.5 లక్షలు, జాయింట్ డిపాజిట్ తొమ్మిది లక్షలు ఉండగా ఇప్పుడు తొమ్మిది, పదిహేను లక్షల డిపాజిట్ వరకు సౌలభ్యం కలిగించారని, మహిళా సమ్మాన్ బఛత్ స్కీం నందు గరిష్టంగా రెండు లక్షల రూపాయలు రెండు సంవత్సరాల కాల పరిమితి గల డిపాజిట్ పై 7.5 శాతం వడ్డీ లభించనుందని, సేవింగ్స్ ఖాతాలు, పోస్టల్ లైఫ్ ఇన్సురన్సులు ఉన్నాయని తెలియజేస్తూ, ప్రొద్దుటూరు ప్రజలు తమ దగ్గరలోని తపాలా కార్యాలయం యందు పై పేర్కొన్న అన్ని స్కీంములకు, డిపాజిట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకొని ఆర్ధిక భవితకు మలి అడుగు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోస్ట్స్ టి. దుర్గా ప్రసాద్, ఆఫీస్ అసిస్టెంట్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
תגובות