కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని కోర్ట్ ఆవరణంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పి.ఆర్.సి సాధన సమితి ఆధ్వర్యంలో జ్యూడిషియరీ ఉద్యోగులు ఈరోజు పి.ఆర్.సి కి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపించారు, ఈ పి.ఆర్.సి ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, CPS విధానాన్ని వెంటనే రద్దు చెయ్యాలని, అశుతోష్ మిశ్రా పి.ఆర్.సి నివేదికను వెంటనే బయట పెట్టాలని, టైం స్కేల్ కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చెయ్యాలని వారు డిమాండ్ చేశారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎక్కడా కూడా తమకు న్యాయ బద్దంగా అలవెన్స్ లు కానీ హెచ్.ఆర్.ఏ లు కేటాయించకపోగా ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు, ఇప్పటికయినా ప్రభుతం పి.ఆర్.సి ని సవరణ చేసి రాష్ట్రము లోని ఉద్యోగులకు తగు న్యాయం చేయవలసిందిగా వారు కోరుకున్నారు.
ఇదిలా ఉండగా నేడు రాష్ట్రము లోని ఉద్యోగులు ఉపాధ్యాయులు తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమం జయప్రదం అయ్యింది అనే చెప్పాలి, వేల సంఖ్యలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జిల్లాల నలుమూల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పోలీసు శాఖ వారు ఉద్యోగులను తమ ఆధీనంలోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషనలకు తరలించినా, వారికి తీవ్ర అడ్డంకులు ఎదురయినా, ఒక ప్రణాళికా బద్దంగా విజయవాడ చేరుకొని తమ నిరసన గళాన్ని వినిపించటం ప్రత్యేకంగా గుర్తించకదగ్గ విషయం.
Comentarios