రంజాన్ పర్వదినాన ఈద్గాలో ప్రత్యేక ఏర్పాట్లు - రాచమల్లు
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు నియోజకవర్గం గోపవరం పంచాయతీ హోసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న ఈద్గాలో రేపు జరగనున్న రంజాన్ పర్వదిన వేడుకల ఏర్పాట్లను నేడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల ముప్పైయవ తారీఖున మునిసిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి దాదాపు అరవై లక్షల రూపాయల మునిసిపల్ నిధులు ఈద్గా అభివృద్ధి కొరకు కేటాయించామని, అందులో భాగంగా ఈద్గా ముఖద్వారం వద్ద ఆర్చి, కాంపౌండ్ గోడల పునర్నిర్మాణం, ప్రార్ధనల కొరకు సప్పట ఏర్పాటు చేసి ఆహ్లాదకరమయిన వాతావరణం బక్రీద్ నాటికి ముస్లిం సోదరులకు అందుబాటులోకి తేవనున్నామని తెలిపారు.
రేపు రంజాన్ పర్వదినం సందర్బంగా దాదాపు పది వేల మంది ముస్లిం సోదరులు ఇక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారని, వేసవి కాలం కావటం చేత ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేసే ముస్లిం సోదరుల కోసం వైసీపీ నాయకులు పట్టణంలోని పలు మార్గాలలో చల్లటి త్రాగునీరు, మజ్జిగ ఇవ్వనున్నారాని, ఇకపోతే ఈద్గాల మైదానంలో చలువ పందిళ్లు, కార్పెట్లు, ముప్పై ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హిందువులు ముస్లిం సోదరులు సఖ్యతతో మెలగాలని, ఒకరినొకరు గౌరవించుకోవాలని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
Comments