వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఉగాది ఉత్సవాలు జరపనున్నట్లు రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, సెక్రటరీ లక్ష్మి ప్రసన్న ప్రకటన చేశారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ కొరోనా వలన మహిళలు ఇంటికే పరిమితమై పోయారని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారముతో ఉగాది ఉత్సవాలు ఈ నెల మర్చి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు స్థానిక అనిబిసెంట్ మునిసిపల్ హైస్కూల్ నందు ఆటల పోటీలు నిర్వహించనున్నామని, ముఖ్యంగా మహిళలకు కబడ్డీ, షాట్ ఫుట్ (గుండు విసురుట), పరుగు పందెం, తాడాట, టగ్ఆఫ్ వార్ (తాడు లాగుట), బాస్కెట్ బాల్, బాంబు బ్లాస్ట్ / మ్యూజికల్ చైర్స్, పేపర్ గ్లాసులు బెలూన్ తదితర ఆటల పోటీలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు నిర్వహించనున్నామని, 27వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు వంటల పోటీ ప్రదర్శనలో భాగంగా షుగర్ వ్యాధిగ్రస్తులు తినే శాఖాహారం, తక్కువ ఖర్చుతో పోషక విలువలు కలిగిన వంటలు, అందరికి అందుబాటులో ఉన్న వస్తువులతో మాత్రమే చెయ్యాలని తెలిపారు.
ఇకపోతే 18 సంవత్సరాలు దాటిన పురుషులకు కబడ్డీ పోటీలు మర్చి 28వ తేదీ అలాగే 29వ తేదీలలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పై పోటీలలో పాల్గొనదలచిన వారు 7396128332, 9246945548 లేదా 8106054776 నంబర్ల యందు సంప్రదించవలసినదిగా కోరారు.
Commentaires