శివాలయంలో యోగా కేంద్రం
ప్రొద్దుటూరు లోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవస్థానం లో ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం యోగా కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ఆలయ ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగ అనేది మనలో అంతర్లీనంగా ఉండే శక్తిని సమతుల్యమైన పద్ధతిలో మెరుగు పరుచుకోవడానికి లేక అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరించే ఒక క్రమశిక్షణ వంటిదని పేర్కొన్నారు కీలకమైన స్వయం అనుభూతిని సాధించుకోవడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుందన్నారు యోగా గురువులు ఎం రామసుబ్బారెడ్డి, ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు ముని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ప్రొద్దుటూరు పట్టణం లో ఆసక్తి కలవారు యోగా శిక్షణలో పాల్గొనవచ్చని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి సి శంకర బాలాజీ ఆలయ సభ్యులు వెంకటేశు, నాగేశ్వరి, భారతి, సావిత్రమ్మ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments