ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంపు రైఫిల్ షూటింగ్‌లో ప్రొద్దుటూరు విద్యార్ధి ప్రతిభ
ప్రొద్దుటూరు, రైఫిల్ షూటింగ్‌లో ప్రొద్దుటూరు విద్యార్ధి జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరచి మెడల్ సాధించారు. సి.రామాపురం తిరుపతి వెరిటాస్ సైనిక్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రొద్దుటూరు దేవాంగపేటకు చెందిన భాస్కర్ రెడ్డి కుమారుడు ఎస్.వి ఓబుళరెడ్డి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా తల్ సైనిక్ రైఫిల్ షూటింగ్‌లో తన సత్తా చాటుకున్నారు. ఏపీ, తెలంగాణ లనుంచి జూనియర్, సీనియర్ విభాగంలో 34 మంది వివిధ విభాగాల్లో జాతీయ స్థాయిలో గ్రూపింగ్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక కాగా, ఏపీ నుంచి వెరిటాస్ సైనిక్ స్కూలు నుంచే ముగ్గురు విద్యార్ధులు ఎంపికయ్యారు. అంతకు ముందుకు ఇంటర్ గ్రూప్ కాంటీషన్, టిఆర్ జి-1, టిఆర్ జి-2 పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. అన్ని స్థాయిలో విశేష ప్రతిభ కనబరచి జూనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచి ఆల్ ఇండియా తల్ సైనిక్ ఘూటింగ్ పోటీల్లో మెడల్ సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రైఫిల్ పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నట్లు మెడల్ సాధించిన వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్ధి ఎస్.వి.ఓబుళరెడ్డి చెబుతున్నారు. తల్లిదండ్రుల సహకారం, స్కూల్ అధ్యాపకుల సహకారం, శిక్షణలో జాతీయ స్థాయిలో గ్రూప్ రైఫిల్ షూటింగ్‌లో మెడల్ సాధించినట్లు చెప్పారు. ఆల్ ఇండియా తల్ సైనిక్ రైఫిల్ షూటింగ్‌లో మెడల్ సాధించిన విద్యార్ధి ఎస్.వి.ఓబుళరెడ్డితో పాటు తల్లిదండ్రలు భాస్కర్‌రెడ్డి, కల్పనలను కమాండెంట్లు సత్కరించి అభినందించారు.
Comments