వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రామేశ్వరంలో వెలసిన అతి పురాతనమైన మూల లింగేశ్వర స్వామి దేవస్థానం, స్థానిక వై.ఎం.ఆర్ కాలనీలో వెలసిన ఆంజనేయస్వామి దేవస్థానం, చిన్నకేశవ స్వామి దేవస్థానం, కొత్తపల్లె పంచాయతీ మీనాపురం గ్రామంలో వెలసిన శివాలయం దేవస్థానాలను అభివృద్ధి చేయటానికి దేవాదాయ శాఖ అధికారులతో కలిసి స్థానిక ఎం.ఎల్.ఏ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నేడు సందర్శించారు, ఈ సందర్భంగా MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన ఈ దేవాలయాలను ఆధునీకరించడం కోసం సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అందుకు ప్రభుత్వం నుండి 80% డబ్బులు వస్తాయని మిగిలిన 20% డబ్బులు ప్రజల వద్ద చందాల రూపంలో వసూలు చేసి, తక్కువ వచ్చిన డబ్బు అంతా తన కుటుంబమే భరిస్తుందని దేవాలయంలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఉద్దేశంతోనే చందాలు వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తపల్లె సర్పంచ్ కొణిరెడ్డి శివచంద్రా రెడ్డి మాట్లాడుతూ, అతి పురాతనమైన మీనాపురం శివాలయాన్ని జనమేజయ గారు నిర్మించారని, అట్టి ఈ శివాలయాన్ని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పునర్నిర్మించాలి అనుకోవటం చాలా సంతోషం అని ఇక్కడి ప్రజలు చుట్టుపక్కల వెంచర్లు వేస్తున్న కాంట్రాక్టర్లు వ్యాపారులు కూడా తమ వొంతు సాయం అందించటానికి ముందుకు రావటం శుభపరిణామం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ బీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, వార్డు కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, శెట్ గురువి రెడ్డి, నాగేంద్ర, దేవాలయ చైర్మన్, DE, AC శంకర్ బాలాజీ ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు వైయస్సార్సీపి నాయకుడు మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentários