వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రభుత్వం వెటర్నరీ విద్యార్థులపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బుధవారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ విద్యార్థులు, ప్రొద్దుటూరు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కాలేజీ విద్యార్థులు సంయుక్తంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేశారు.
వెటర్నరీ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెటర్నరీ విద్యార్థుల డిమాండ్లను అధికారులకు తెలియజేసేందుకు అందరికీ వినతి పత్రాలను సమర్పించారు, ఈ సందర్భంగా వారు న్యాయపరమైన డిమాండ్లు చేశారు. పశు వైద్య పట్టభద్రులు మరియు విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే విధంగా కిందిస్థాయి ఉద్యోగులతో సమానంగా ఆర్బికేలో నియమించాలని, ప్రభుత్వ అధికారులు యోచిస్తున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని అన్నారు. భారత ప్రభుత్వ మండలి 1984 చట్ట ప్రకారం రాష్ట్రంలో ఆర్ ఎల్ యు లను పీడీలుగా, పశువైద్యుల నియామకం చేపట్టాలని, వైయస్సార్ వెటర్నరీ ల్యాబ్స్ లలో స్పెషలైజ్ వెటర్నరీ డాక్టర్లని వెంటనే నియమించాలి అని, వీటిని వారు డిమాండ్లుగా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముని చైతన్య, డాక్టర్ ఉదయ్, విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments