వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
న్యాయం చేయాలని అంటూ అత్తింటి ముందు బైఠాయించిన కోడలు, వివరాల్లోకి వెళితే కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శాంతకుమారి వీధిలో నివాసముండే వంకం అమర్నాద్ కు 2009 నవబంర్ లో పూర్ణ తో వివాహం జరిగింది. వివాహ సమయంలో దాదాపు పెన్నెండు లక్షల రూపాయల కట్న కానుకల క్రింద ముట్టచెప్పామని వివాహం జరిగిన కొద్ది కాలానికే గర్భవతి అయిన పూర్ణ హాస్పిటల్ ఖర్చులు తన పుట్టింటి వారే భరాయించాలని తన భర్త, అత్త, ఆడబిడ్డ పుట్టింటికి వెళ్ళమని తనను వేదిస్తూ ఉండేవాడని బలవంతాన తనను పుట్టింటికి పంపించారని, డెలివరీ అయ్యేంత వరకు తన భర్త తనను ఇంటికి రావద్దని హుకుం జారీ చేయగా చేసేదేమిలేక తన తల్లి వద్దనే ఉండసాగింది, డెలివరీ అయ్యే సమయానికి ఆపరేషన్ చేసే సమయంలో కనీసం సంతకం చేసే దానికి కూడా తన భర్త రాలేదని. తాను తన బిడ్డ ఇంటికి వస్తాం అన్నప్పుడల్లా ఈనెల బాగోలేదు రేపు నెలలో నేను వచ్చి తీసుకెళ్తాను అంటూ చెప్పుకుంటూ రెండు సంవత్సరాల కాలం గడిపాడు అని వాపోయింది. ఈరోజు పూర్ణ తన తల్లి, అన్న, వదినతో కలిసి అత్తింటి వద్ద బైఠాయించి తగు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది. విషయం తెలుసుకున్న స్థానిక ఒకటవ పట్టాన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని భార్య భర్తలకిద్దరికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
Comments