రక్షణ గోడ నిర్మాణంతో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం..
--గుంజనేరు రక్షణ గోడ భూమి పూజలో కొరముట్ల.
రక్షణ గోడ నిర్మాణంతో చిట్వేలు గ్రామ బ్రాహ్మణ వీధి నివాసాల ప్రజలు సుదీర్ఘ సమస్యకు పరిష్కారం పొందారని శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం రక్షణ గోడ నిర్మాణానికి సదరు గోడ నిర్మాణ గుత్తేదారు వైసిపి సీనియర్ నాయకులు, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ పాటూరి శ్రీనివాసులు రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు. కొరముట్ల మాట్లాడుతూ..
శేషాచల కొండల్లో మొదలై కోడూరు, చిట్వేలి మీదుగా ప్రవహిస్తున్న గుంజున వేరు నదీ ప్రవాహం వల్ల చిట్వేలి గ్రామం బ్రాహ్మణ వీధిలో నివాస ప్రజలు పలు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని" హలో గుడ్ మార్నింగ్" కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో ఈ సమస్యను రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తెలియపరచామన్నారు. జగనన్న సానుకూల స్పందన తో సుదీర్ఘ సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. 250 మీటర్ల మేర 2 కోట్ల 60 లక్షల వ్యయం తో పటిష్టమైన రక్షణ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తిచేసి కోతకు గురవుతున్న నివాసాలకు రక్షణ కల్పిస్తామని గుత్తేదారు పాటూరి శ్రీనివాసుల రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వీ మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి,మలిశెట్టి వెంకటరమణ, గిరిధర్ రెడ్డి, నాగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, యన్నారు. కిషోర్ కుమార్, మాదినేని చిన్నా రాయల్,ఎంపీపీ చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి,లింగం లక్ష్మికర్, వెంకట సుబ్బారెడ్డి, చిన్న , అఖిల్ రెడ్డి,ఎంపీటీసీ శివయ్య, గుండయ్య, దేవరాజు,జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు,సుబ్బరాయుడు, రాముడు, హాజరత్ రెడ్డి, తాసిల్దార్ మురళీకృష్ణ, డిఈ చెంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comments