top of page
Writer's picturePRASANNA ANDHRA

నవ రత్నాలపై జనసేనాని సంధించిన ప్రశ్నలివే

పవన్ 'నవ సందేహాలు'..9 పథకాలపై జనసేనాని సంధించిన ప్రశ్నలివే

వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పలు సందేహాలు లేవనెత్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 'నవ సందేహాలు' పేరుతో ఆయన ఓ ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌లో రైతుభరోసా, అమ్మఒడి, పెన్షన్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై తన ప్రశ్నలను పవన్‌ సంధించారు.


పవన్‌ లేవనెత్తిన సందేహాలు.


మొదటి రత్నం - రైతు భరోసా


64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?


రెండో రత్నం - అమ్మఒడి

అమ్మఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?


మూడో రత్నం - పెన్షన్ల

పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?


నాలుగో రత్నం - సంపూర్ణ మద్యపాన నిషేధం

మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు.. 2021-22లో రూ.22 వేల కోట్లు.. ఇదేనా మద్యనిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?


ఐదో రత్నం - జలయజ్ఞం

పోలవరం ప్రాజెక్టును 'యుద్ధ ప్రాతిపదిక'న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?


ఆరో రత్నం - ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?


ఏడో రత్నం - ఫీజు రీయింబర్స్ మెంట్

పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా?


ఎనిమిదో రత్నం - పేదలందరికీ ఇళ్లు

చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ఎందుకు నిధులు మంజూరు చేయలేదు?


తొమ్మిదో రత్నం - ఆసరా

పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?

20 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page