పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శం! సోషలిజం అజేయం!! సిఐటియు జిల్లా కార్యదర్శి సి హెచ్ చంద్రశేఖర్!!!
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి సభను అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సిఐటియు ఆఫీసులో గురువారం ఉదయం , సిగి చెన్నయ్య, అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
సిఐటియు కడప జిల్లా కార్యదర్శి సి హెచ్ . చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, నేటి రాజకీయ వ్యవస్థ బ్రష్టు పట్టి పోయిందని, దాన్ని మార్చాలంటే పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శం అన్నారు.
నెల్లూరు జిల్లా అలగానిపాడు భూస్వామ్య కుటుంబంలో 1913 మే 1వ తేదీన జన్మించారని, చిన్నతనంలోనే. కుల వివక్షత అంటరాని తనానికి వ్యతిరేకంగా, దళిత కూలీలకు తన ఇంట్లోనే, కుటుంబ సభ్యులను వ్యతిరేకించే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారన్నారు. మనుషులందరూ సమానమే, కులానికి వ్యతిరేకంగా, సుందర రామిరెడ్డి, సుందరయ్య గా పేరు మార్చుకున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలి రేట్లు హక్కులకోసం పోరాడారని. గాంధీ జాతీయోద్యమ స్ఫూర్తితో, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, స్వాతంత్ర ఉద్యమం నడిపారన్నారు. కమ్యూనిస్టు నాయకుడు, హైదర్ ఖాన్ పరిచయంతో దక్షణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, బాధ్యతలు చేపట్టారన్నారు.
బ్రిటిష్ వారి నుండి కమ్యూనిస్టు నిర్బంధాలను తట్టుకుంటూ, జాతీయ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం, పోరాడారన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. నాలుగు వేల మంది సాయుధ పోరాటంలో అమరులయ్యారని, 10 లక్షల ఎకరాల భూములు పంచారని తెలిపారు. పార్లమెంట్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా, నిరాడంబరంగా, సాధారణంగా, సైకిల్ పై నే పార్లమెంట్ కి హాజరై ఆదర్శంగా నిలిచారు అన్నారు.
నేటి రాజకీయ నాయకులు ఎమ్మెల్యే అయితేనే కోట్ల రూపాయలు సంపాదించి లక్షల రూపాయల కార్లలో విలాసవంతంగా తిరుగుతున్నారని . భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య పార్టీ కోసం ప్రజల కోసం , తన యావదాస్తిని త్యాగం చేశారన్నారు. పిల్లలు పుడితే స్వార్ధం పెరుగుతుంది, తన సహచరి నీలమ్మను ఒప్పించి, పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసుకొని, తను నమ్మిన సిద్ధాంతం కోసం నిలిచారన్నారు. ప్రజలే తన పిల్లలుగా భావించారు.
15 సంవత్సరాలు మొట్టమొదటి ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు గాను పని చేశారు, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, వీర తెలంగాణ విప్లవ పోరాటం అనుభవాలు, ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి పథకం , రాసిన పుస్తకాలు, నేటికి ఆచరణీయం అన్నారు. రివిజన్ నిజానికి వ్యతిరేకంగా 1964లో , సిపి ఐ ఎం పార్టీ ఏర్పడినప్పుడు జాతీయ కార్యదర్శి గా పని చేశారు.పెట్టుబడిదారీ సమాజంలో దోపిడీకి వ్యతిరేకంగా, పీడిత ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు అండగా నిలబడ్డారు. ఇటువంటి ఆదర్శ నేత, నమ్మిన సిద్ధాంతం కోసం 1985 మే 19వ తేదీ మరణించేవరకు సిపిఎం లో కొనసాగారని, అటువంటి వారసత్వంతో కొనసాగుతున్న పార్టీ కమ్యునిస్ట్ పార్టీ అన్నారు.ప్రస్తుతం ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని, సోషలిస్ట్ దేశాలే ప్రపంచానికి దిక్సూచిగా పనిచేస్తున్నాయని, సమస్యల పరిష్కరించే అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నారు. చైనా, క్యూబా, వియత్నం, ఉత్తర కొరియా, లావోస్, లాంటి సోషలిస్టు దేశాలు, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో సోషలిజం అజేయం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు లింగాల యానాదయ్య, సిఐటియు నాయకులు, సి.పుల్లయ్య, హేమంత్ రాజు, సుబ్రమణ్యం రాజు, సి వేణు, ఎం. సుబ్బారాయుడు, గంగయ్య, పెంచలయ్య, డివైఎఫ్ఐ మండల కన్వీనర్, కర్ర తోటి హరినారాయణ, 500456053913 జిల్లా సహాయ కార్యదర్శి పి. జాన్ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, గంపల దేవయ్య, మాదాసు మధు, కెవిపిఎస్ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments