పోలియో ఆదివారం - ఫిబ్రవరి/ 27/2022 - 05 సం|| లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం... పోలియో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని ఇవ్వకండి. #polio
అమరావతి, పోలియో పై ప్రతి ఒక్కరికి అవగాహన ప్రస్తుతం ఉంది, అయినా ప్రభుత్వం 0 నుండి 5 సంవత్సరముల పిల్లలకు పోలియో చుక్కలు వేయించమని ప్రతి సంవత్సరం అవగాహన సదస్సులు, బ్యానర్ల ద్వారా, టీవీ, రేడియో ద్వారా ప్రకటనలు చేసి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూనే, పోలియో చుక్కలకంటూ ఒక తేదీని నిర్ణయించి చిన్నారులను పోలియో నుండి కాపాడే ప్రయత్నంలో విజయం సాధించారనే చెప్పాలి. ఇందులో ప్రధాన పాత్రధారులు అయినా ఆశా వర్కర్స్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారిని మెచ్చుకోక తప్పదు, వారి పరిధిలోని ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసే దిశగా కూడా కొందరు అడుగులు వేశారు. ప్రస్తుత వాలంటీర్ల వ్యవస్థ కూడా ఇందుకు అనుగుణంగానే పనిచేస్తోంది, వాలంటీర్ పరిధిలో తనకు కేటాయించిన గృహాలపై సరయిన అవగాహన కలిగిన వాలంటీర్లు వాట్సాప్ ద్వారా లేదా 0 నుండి 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కాల్ చేసి మరీ గుర్తు చేస్తున్నారు, ఇది సంతోషించదగ్గ పరిణామం. ఏది ఏమయినా 0 నుండి 5 సంవత్సరాల పిల్లకు పోలియో చుక్కలు వేయిద్దాం... పోలియోను సమూలంగా ప్రాలద్రోలి... పోలియో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాన్ని ఇవ్వకండి.
留言