కడప జిల్లా, రైల్వేకోడూరు లో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణలో భాగంగా శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు సాయంత్రం రైల్వేకోడూరు పట్టణo గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. కొరముట్ల మాట్లాడుతూ తమ పిల్లలను అంగవైకల్యం నుంచి రక్షించడానికి పోలియో చుక్కలు ఇప్పించే బాధ్యత కుటుంబ సభ్యులదే అని అన్నారు.
0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ కేవలం రెండు చుక్కల టీకాతో పోలియో మహమ్మారిని 100 శాతం నిర్మూలించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజా రెడ్డి, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్, మహేశ్వర్ రెడ్డి, కరీముల్లా, రత్తయ్య, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments