కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పివి సింధు.
--నాలుగో స్థానంలో నిలిచిన భారత్.
బర్మింగ్ హోం లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో బ్యాట్మెంటన్ సింగిల్స్ ఫైనల్లో స్వర్ణ పథకం కైవసం చేసుకున్న తెలుగు తేజం పీవీ సింధు.. దీనితో భారత్ నాలుగో స్థానంలో నిలిచినది. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీ పై తొలి పోరులో 21-15 ;రెండో ఆట లో 21-13 తో కైవసం చేసుకుంది. దీనితో వరుసగా రెండు ఆటల్లో ఆధిపత్యం చెలాయించి పివి సింధు భారత్ కు మరో పసిడిని అందించింది.
అయితే కామన్వెల్త్ క్రీడల్లో తనకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం,2018 లో రజితం సాధించగా ఈ స్వర్ణంతో కలిపి 2022 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొత్తం 56 పథకాలు సాధించి నాలుగువ స్థానంలో నిలిచింది. ఇందులో 19 స్వర్ణాలు, 15 రజితాలు, 22 కాంశ్యాలు ఉన్నాయి.
Comments