బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సందిస్తు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వంగి గులాములు చేసే తోడేలు చంద్రబాబు - రాచమల్లు
మంగళవారం మధ్యాహ్నం పట్టణంలో లోకేష్ లేని హడావుడి సృష్టించారని, తమ నాయకుడు సీఎం జగన్ ను ప్యాలెస్ పిల్లి అని అనటం సరయిన ఉపమానం కాదన్నారు. చంద్రబాబుకు జగన్ మోహన్ రెడ్డికి వ్యత్యాసం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. నాడు నరేంద్ర మోడీ అధికారంలో లేనప్పుడు ఆయన ఆంధ్ర రాష్ట్రం లోకి ప్రవేశానికి ఆంక్షలు విధించారు అని, నేడు అధికారంలో ఉన్నందున మోడీ కాలు పట్టుకున్నారని ఏద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రామారావు స్థాపించిన పార్టీ టీడీపీ కాగా, అధికారం చేపట్టబోయేది రాహుల్ గాంధీ అని భావించి ఆయన కాళ్ళు పట్టుకున్నారన్నారు.
వంగి గులాములు చేసే తోడేలు చంద్రబాబు అని, వైఎస్ఆర్ హిమాలయ శిఖరం అంత ఎత్తయిన మహోన్నత భావజాలం గల నాయకుడని, కాగా విధి వక్రించి నెలకు వొరిగి స్వర్గస్తులైనారాన్నారు. జగన్ ఇచ్చిన వాగ్దానం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అధినేత సోనియా గాంధీని సర్వ సాధారణంగా వ్యక్తిగా ఎదిరించాడన్నారు. ఢిల్లీ కోటకు ఎదురుగా నిలబడ్డాడని, ఢిల్లీ కోటను ఢీ కొనడానికి సిద్దం అని 16 నెలలు జైలుపాలుకాగా, ఢిల్లీ పెద్దల అహంకారాన్ని ఎదిరించి పాద యాత్ర చేశారని, జగన్ పిల్లి కాదు పులి అని, ముఖ్యమంత్రి పీఠం కోసం 16 నెలల జైలు జీవితం అనుభవించారని, ఓదార్పు యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో నాడు రాహుల్ గాంధీ అనుమతి నిరాకరించారని, నేడు రాహుల్ భారత్ జొడో యాత్ర ఆంధ్రాలో రావటానికి జగన్ పెర్మిషన్ అడిగారని గుర్తు చేశారు.
రాజకీయ క్షేత్రంలో జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడు లేడని, ధైర్యం ఆయన ఆయుధం, ఓర్పు సహనం కలవాడు జగన్ అని కితాబిచ్చారు. మోసం కుట్ర వంచన చంద్రబాబు లక్షణం అని పేర్కొన్నారు. జగన్ రాబోవు ఎన్నికల్లో 175 సీట్లు వేటాడతానికి సిద్ధం అవుతున్నారని, టీడీపీ, ఇతర పార్టీలు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్ ను లోకేష్ వంద సార్లు పిల్లి అన్నా, పులి పిల్లి కాదన్నారు. ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉప్పు సత్యాగ్రం చేశారా, లేక స్వాతంత్ర పోరాటం చేశారా పరామర్శ లోకేష్ వచ్చారని ప్రశ్నించారు. స్త్రీలపై దాడి చేస్తే పరామర్శించటానికి లోకేష్ వచ్చారా? అని ఏద్ధేవా చేశారు.
తమ వైసీపీ కార్యకర్తల మీద కూడా కేసులు నమోదు చేసి ఆరు మందిని జైలుకు పంపారని గుర్తు చేస్తూ, తనను బెట్టింగ్ రెడ్డి అనరని, బుడ్డా వెంగల్ రెడ్డి అని అంటారన్నారు. తనది అక్రమ సంపాదన అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని, త్వరలో తానే సీబీఐ అధికారులను తనపై సంపూర్ణ విచారణ కోరుతున్నట్లు ప్రకటించారు. నా లాగా టీడీపీ నాయకులు కూడా వారిపై సీబీఐ దర్యాప్తు చేయమని అడుగాగలరా అని సవాల్ విసిరారు.
సహనాన్ని కోల్పోయి పవన్ మాట్లాడుతున్నాడు - రాచమల్లు
పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతాను అనటం, తాను పూర్తిగా వ్యతరేకిస్తున్నానని, ఈ మాటను తప్పు పడుతున్నానని రాచమల్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ సంతానానికి పవన్ దత్త పుత్రుడు అని వ్యాఖ్యానించారు. బాబును అధికారంలోకి తీసుకురావటం కోసం పవన్ అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారని, సంస్థాగతంగా ఏ విధమైన అజెండా లేకుండా 2014 లో 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయారని ఆరోపణలు గుప్పించారు.
కొడకల్లారా అని పవన్ మాట్లాడటం సబబు కాదని, మేము నీ కొడుకులమా అని ఆగ్రహానికి లోనయ్యారు. పవన్ మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదా! అని ప్రశ్నించారు, పెద్ద మనిషిగా మాట్లాడాల్సిన మాటలు పవన్ మాట్లాడలేదని అభిప్రాయ పడ్డారు. స్త్రీలను పవన్ అగౌరవ పరిచారని, ఆయన భార్యలతో వర్క్ అవుట్ కానందునే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనటం హిందూ సంప్రదాయాన్ని అగౌరవ పరచటమే అని అభప్రాయపడ్డారు. భారతదేశం లో అందరూ పవన్ లాగా భావిస్తే సంసారాలు నిలవవని, భారతీయ వివాహ బంధం ప్రకారం బొందిలో ప్రాణం ఉన్నంత వరకు భార్యను భరించాలన్నారు. చెప్పుతో కొడతాను అంటూ బూతులు మాట్లాడి పవన్ తన వ్యక్తిత్వాన్ని కొల్పోయారని అన్నారు. పవన్ ప్రజలకు తప్పుడు సంకేతలు ఇస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇకపై పవన్ ఇలాగే మాట్లాడితే తాను పురుష పదజాలంతో కటినంగా మాట్లాడవలసి వస్తుందని హెచ్చరించారు.
బాబు పవన్ కలయిక ఈనాటిది కాదని, పార్టీలు ఆన్ని కలిసి తమపై పోటీ చేసినా వైసీపీకి జరిగే నష్టం ఏమి లేదని, 2024 ఎన్నికలు త్వరగా రావాలి అని కొరుకుంటున్నట్లు, అప్పుడు టీడీపీ జనసేనలకు బుద్ది చెబుతామని హెచ్చరించారు. నలబై యేండ్ల రాజకీయంలో బాబు ఏనాడైనా గడప గడప వంటి కార్య్రమాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించారా అని, అసలు లోకేష్ తమ వైసీపీ పార్టీకి పోటీనే కాదని, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాన్ తమ అభిప్రాయం పూర్తిగా మార్చుకోవాలని అన్నారు.
Comments