వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం - ఎమ్మెల్యే రాచమల్లు
వైసిపి నాయకులు కార్యకర్తల శాంతియుత ర్యాలీ
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి, వైసీపీ నాయకుడు, ముఖ్యమంత్రి చిన్నాన్న అయిన వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక శివాలయం సెంటర్లో వైసీపీ శ్రేణులు రాస్తారోకో, నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. వైయస్ వివేక హత్య కేసు విచారణ సిబిఐ దర్యాప్తు సరైన రీతిలో జరగడం లేదంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి విమర్శించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని కేవలం జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారని రాచమల్లు అన్నారు. సుధీర్గ రాజకీయ ప్రయాణం చేసిన వైయస్ వివేకానంద రెడ్డికి రాజకీయ వైరం ఎవరితో ఉండదా అని ప్రశ్నించారు... హిమ కుంట ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం వెనుక ఎవరి హస్తము ఉందో అందరికీ తెలుసని రాచమల్లు అన్నారు. బెంగళూరులోని ల్యాండ్ సెటిల్మెంట్, సునీల్ తల్లితో అక్రమ సంబంధం, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక అబ్బాయికి జన్మనిచ్చి వారసత్వ గొడవలు వంటి కోణంలో సిపిఐ విచారణ జరపలేదని, వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ బీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ కల్లూరు నాగేంద్రారెడ్డి, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకుడు కాకర్ల నాగ శేషారెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మహిళా నాయకురాల్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments