మానవీయ కోణంలో సీబీఐ అధికారులు ఆలోచించాలి - రాచమల్లు
కడపజిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అత్యవసర పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీబీఐ అధికారులపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారనకు కడప ఎంపీ అవినాష్ హాజరవ్వాలని, అయితే నేడు ఉదయం అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి కి ఉన్నఫలంగా ఆరోగ్య పరిస్తితి బాగొలేనందున, ఈ క్రమంలో నేడు విచారణకు రాలేనని తమ లాయర్ల ద్వారా సీబీఐ అధికారులకు అవినాష్ తెలిపారని, అవినాష్ చెప్పిన కారణం సీబీఐ అధికారులను సంతృపి పరచలేదన్నారు.
అందుకే అవినాష్ పులివెందులకు వస్తుంటే ఒక దేశద్రోహిని వెంటపడినట్లి సీబీఐ అధికారులు వెంట పడ్డారని, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం సీబీఐ అధికారులు ఇలా చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కేవలం నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ పై సీబీఐ అధికారులు తీరు ఇలా ఉండటం బాధాకరం అని ఆయన విచారం వ్యక్తం చేశారు. తన తల్లి ప్రమాదంలో ఉంటే రాలేకపోతున్నానని చెప్పినా సీబీఐ అధికారులు ఇంతటి కఠినమైన కోణంలో ఆలోచించడం దేనికని ప్రశ్నించారు. రెండు సార్లు ఎంపీ గా పని చేసిన ఒక వ్యక్తిపై సీబీఐ అధికారుల ధోరణి సరైనది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట ఆని, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బ తీయడానికి వివేకా హత్యను చంద్రబాబు ఒక పావులా వాడుకుంటున్నాడని ఆరోపణలు గుప్పించారు. తన తల్లికి ఆరోగ్యం బాగలేనప్పుడు మానవీయ కోణంలో సీబీఐ అధికారులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ హత్యలో అవినాష్ రెడ్డి కి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు.
Comments