నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ సభా భవనంలో పంచాయతీ అధికారులు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, గ్రామ సెక్రటరీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పిటిసిలు, నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రచమల్లు మాట్లాడుతూ, కామనూరులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకపోతే అధికారులు ఇంటికి వెళ్తారని ఎమ్మెల్యే హెచ్చరించారు.. రైతులు పొలాల కోసం కుందు నది నుండి ఇసుకను రవాణా ట్రాక్టర్ కు మూడు వందల రూపాయలు చొప్పున మాజీ ఎమ్మెల్యే వరద వర్గీయులు వసూలు చేస్తున్నారని, ఆ గ్రామానికి చెందిన రైతులు, నేతలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఇలాంటి చర్యలను ఎవరు చేసినా సహించేది లేదన్నారు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలన్నారు, గ్రామాల్లో అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం మంచిది కాదన్నారు. అధికారులు వీటిపై దృష్టి సారించాలని, కామనూరులో 25 ఏళ్లుగా అప్రజాస్వామికత రాజ్యం ఏలుతోందని అన్నారు.
దౌర్జన్యంతోనే ఓట్లు వేసుకుంటున్నారన్నారనీ, దీనిపై ఎన్నికల అధికారులు, కలెక్టర్, ఎమ్మార్వోలు దృష్టి సారించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలన్నారు. ఎవరైనా ట్రాక్టర్కు కప్పం కట్టాలని వస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సెక్రటరీలను, ఎమ్మార్వో, ఎంపీడీవో లను ఆదేశించారు. నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో జెడ్పిటిసి వైస్ చైర్మన్ జైష్తాది శారద, మున్సిపల్ చైర్మన్ భీముని పల్లి లక్ష్మీ దేవి నాగరాజు, ఎంపీపీ శేఖర్ యాదవ్డ్పి, ఎంపీటీసీ అంజనీ కుమారి, రాజుపాలెం ఉప మండల అధ్యక్షుడు, గ్రామాలకు చెందిన సర్పంచులు సెక్రటరీలు, జెడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments