175 సీట్లు నెగ్గాల్సిందే - రాచమల్లు
వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
పొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ హైస్కూల్ మైదానం నందు ఆదివారం ఉదయం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన సచివాలయ కన్వీనర్, గృహసారదుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పెద్దఎత్తున నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తనదైన శైలిలో అటు ప్రత్యర్థుల పైన ఇటు ప్రతిపక్షాల పైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాబోవు ఎన్నికలలో వైసిపి తన సత్తా చాటుకుని రాష్ట్రంలోని 175 స్థానాలలో తన సత్తా చాటుకొని అధికారంలోకి రానున్నట్లు జోస్యం చెప్పారు. సమావేశం సాంతం వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి గా నిలబెట్టాలన్నదే తమ ముందున్న కర్తవ్యంగా ప్రసంగించిన నాయకులు.
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రసంగిస్తూ తన ఊపిరి ఉన్నంత వరకు ప్రొద్దుటూరులో తెలుగుదేశం జెండా ఎగరనివ్వనని, ఎన్నికలకు సమయం ఆసన్నమైందని నాయకులు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2024లో జరిగే ఎన్నికలకు నేడు సమర శంఖం పూరిస్తున్నాం అని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం సభ ఏర్పాటు చేశామని, శక్తివంతమైన, పటిష్టవంతమైన, సంస్థాగతమైన నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు.
నియోజకవర్గ పరిధిలోని ఎనబై రెండు సచివాలయలలో ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్ల చొప్పున రెండు వొందల నలబై ఆరు మందిని, ప్రతి యాబై కుటుంబాలకు ఒక వాలంటరీ చొప్పున పద్దినిమిది వొందల మంది వాలంటీర్లను, యాబై ఇళ్లకు ఇద్దరు గృహసారధుల చొప్పున మూడు వేల ఆరు వొందల మందిని, నలబై మంది కౌన్సిలర్లు, ఇరవై తొమ్మిది మంది ఎంపీటీసీలు, ఇద్దరు జెడ్పిటిసిలు, ఇద్దరు మండల అధ్యక్షులు, ఇద్దరు మండల ఉపాధ్యక్షులు, ఒక మున్సిపల్ చైర్మన్, ఇద్దరు మున్సిపల్ వైస్ చైర్మన్లు, ముగ్గురు కో ఆప్షన్ నెంబర్లు, ఇరవై అయిదు మంది గ్రామ సర్పంచులు, ఇద్దరు మండల అధ్యక్షుల తో శక్తివంతమైన, పటిష్టవంతమైన, సంస్థాగతమైన నాయకత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోవు ఎన్నికలలకు సన్నద్ధం అవుతోందని, ఎన్నికలకు తాము సిద్ధమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ దుగ్గయిపల్లి మల్లికార్జున రెడ్డి, అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సింగసాని గురు మోహన్, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పోలా శ్రీనివాసులు రెడ్డి, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసీపీ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకుడు పోరెడ్డి నరసింహా రెడ్డి, కల్లూరు నాగేంద్ర, టీటీడీ బోర్డు మెంబెర్ టంగుటూరి మారుతీ ప్రసాద్, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comentarios