ప్రజలకు వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి లేదు - రాచమల్లు
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
లోకేష్ పాదయాత్రలో ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి లేనప్పుడు ప్రతిపక్ష టిడిపి నాయకుడు లోకేష్ చేస్తున్న పాదయాత్రకు ఫలితం లేదని ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టిడిపి చేపట్టిన పాదయాత్ర బలహీనమైనదని, ఇలాంటి బలహీనమైన పాదయాత్ర తాను మునుపెన్నడు చూడలేదని ఎద్దేవా చేశారు. విమర్శించడానికి ప్రతిపక్షాలకు కారణాలు లేవని, ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి లేనప్పుడు టిడిపి చేపట్టిన పాదయాత్రకు ఫలితం దక్కదని, లోకేష్ చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని, మోటార్లకు మీటర్లు బిగిస్తే పగులకొట్టండి అనటం టిడిపి కి రైతులపై ఉన్న ద్వేషాన్ని బట్టబయలు చేసిందని, వ్యవసాయం కోసం రైతులు వాడే విద్యుత్తు యూనిట్లలో తెలుసుకునేందుకే ప్రభుత్వం మీటర్లను ఏర్పాటు చేసిందని, తద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత మేరకు చేయాలి, నాణ్యమైన విద్యుత్తును అటు రైతులకు, ఇటు ప్రజలకు సరఫరా చేయుటకు దోహదపడుతుందని, ఇందుకుగాను రైతులు వాడుతున్న విద్యుత్ చార్జీలను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని, విద్యుత్ మీటర్లు పగలగొట్టడం వలన రైతులకే నష్టమని ఆయన పేర్కొన్నారు.
గతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని అన్నారని, నేడు ఆయన కుమారుడు నారా లోకేష్ విద్యుత్ మీటర్లను పగలగొట్టండి అనటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఇక గోకులం మినీ గోకులం గురించి మాట్లాడిన నారా లోకేష్ కు పాడి పరిశ్రమ గురించి ఏమైనా అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. గ్రామాలలో పాడి పశువులు ఎక్కువగా ఉన్నచోట ప్రభుత్వం షెడ్లు వేసి ఆ షెడ్లలో పశు సంరక్షణ కోసం ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తారని, గత టిడిపి ప్రభుత్వ హయాంలో 2518 మంది ఉద్యోగులు 6500 వేతనంతో పని చేశారని, నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బికేల ద్వారా వీరు విధులు నిర్వహిస్తున్నారని ఆయన గుర్త చేశారు. నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో నియమించబడ్డ ఉద్యోగులను ఎవరిని తాము తొలగించలేదని, పాడి పరిశ్రమకు చంద్రబాబు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేస్తూ, నాటి వైయస్సార్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తే, విద్యుత్ తీగలపై బట్టల ఆరేసుకోండి అని చంద్రబాబు చలోక్తులు విశిరారని, వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గానికి 64 లక్షల రూపాయల విలువ గల రెండు అంబులెన్సులు పాడి రైతుల సహాయార్థం అందించారని, వైయస్సార్ నష్టపరిహార పథకం క్రింద రైతుల ఎనుములు చనిపోతే 15000, ఆవులు చనిపోతే 25000, అలాగే గొర్రెలు చనిపోతే 2000 రూపాయల చొప్పున, పాడి రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించినప్పటికీ బీమా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. నాడు టిడిపి ప్రభుత్వ హయాంలో పరిమిత సంఖ్యలో పశు వైద్యశాలలు ఉండేవని 2014-19 సంవత్సరానికి గాను 12996 గోకులాలు నిర్మించగా, దాదాపు 14469 గోకులాలు నిర్మించలేదని, నేడు వైసీపీ హయాంలో టిడిపి నిర్మించిన గోకులాలకు నిధులు మంజూరు చేస్తున్నామని, పరిమిత సంఖ్యలో వైద్యశాలలు ఉండగా వైసీపీ హయాంలో ప్రతి పల్లెకు ఆర్బికేల ద్వారా పశువైద్యశాలలు వెటర్నరీ డాక్టర్లను నియమించి అంబులెన్స్ ద్వారా పశువులకు చికిత్స చేస్తున్నామని, రైతులకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యం అందుతుందని అది తమ ప్రభుత్వం ఘనతేనని ఆయన వెల్లడించారు.
ఇకపోతే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేదని, కేంద్ర ప్రభుత్వమే నియంత్రిస్తుందని ఆయన వెల్లడించారు. నాటి టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి ఒక బీసీ నాయకునికి కూడా పదవులు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేసి మునిసిపల్ చైర్మన్, పలు కమిషన్లకు చైర్మన్లు గాను, డైరెక్టర్ల గాను పదవులు ఇచ్చామని ఆయన తెలిపారు.
Comments