విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాఘవేంద్ర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తామస్ మాట్లాడుతూ, ప్రకాష్ అనే విద్యార్థికి సప్లిమెంటరీ హాల్ టికెట్ కు రుసుము కట్టించుకుని హాల్ టికెట్ తమ వద్ద పెట్టుకొని విద్యార్థికి ఇవ్వకుండా వేధించి, పరీక్ష సమయం అయిపోయిన తర్వాత విద్యార్థికి సమయం అయిపోయింది అని చెప్పి, విద్యార్థి జీవితాన్ని సర్వనాశనం చేయడం జరిగింది అని, విద్యార్థికి న్యాయం చేసేంత వరకు కళాశాల సీజ్ చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజు, వీరేష్, సైఫుల్లా, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
Comments