రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య
ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని.. ఇది దేశ ప్రజాస్వామ్యం లో చీకటి రోజు అని ఏపీసీసీ కార్యవర్గ సభ్యులు అత్తింజేరి శ్రీనాథ్ శుక్రవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. బీజేపీ దేశంలో కుల మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
మోడీ, అమిత్ షాలు దొంగలకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాయని., వీరి అవినీతిని రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని, పార్లమెంటు లో కూడా వారిని అక్రమాలను ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉందని అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశారని అన్నారు. ఎన్నికలలో ధైర్యంగా ఎదుర్కోలేక గతంలో తప్పుడు కేసులు పెట్టారన్నారు.
రాజ్యాంగ బద్దంగా ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తిని ఎలా అనర్హుడిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షాల విధానాలపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులంతా తమ నాయకుడికి అండగా ఉంటామని అన్నారు. రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేకే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అప్రజాస్వామిక అన్నారు.
Comments