మంత్రివర్గ విస్తరణలో కొరముట్ల పేరు తొలగింపు.
రైల్వే కోడూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రి - దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కురముట్ల హరీశ్.
ఈరోజు రైల్వే కోడూరు నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆఫీస్ నందు దళిత హక్కుల పోరాట సమితి సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో కురముట్ల హరీశ్ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ కి.. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకూ వరుసగా ఈ ప్రాంతంలోని దళిత యంయల్ఏ ని గెలిపించుకుంటూ వచ్చారు ,ఈనాడు దీనికి బహుమతిగా కోడూరు ప్రజలకు రావల్సివున్న మంత్రి పదవిని ఇవ్వకపోవడం అగ్రవర్ణ కుల కుటిల బుద్ధికి నిదర్శనమని అన్నారు.
ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గా ఉన్న కొరముట్ల శ్రీనివాసులు గతంలో మీకోసం అయన ఎమ్మెల్యే పదవిని వదులుకోవడం అయన చేసిన తప్పా, మీ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉండడమే అయన చేసిన తప్పా, కోట్లు ఇస్తామని గతంలో మినిస్టర్ పదవి ఇస్తామని చెప్పినా గతంలో పార్టీ మారకుండా మీకు అండగా నిలబడడం అయన చేసిన తప్పా ..? అని ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యే ల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన కొరముట్ల శ్రీనివాసులు అత్యంత సౌమ్యుడు, వివాధ రహితుడయిన వ్యక్తి కి మంత్రి పదవి ఇవ్వక పోవడం కోడూరు నియోజకవర్గ దళిత ప్రజల గొంతు నొక్కడమే అని అయన అన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి పునరాలోచన చేసి కోడూరు నాకు రెండో పులివెందుల అన్న మాట నిల బెట్టుకుని కోడూరు నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే కి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ కి కోడూరు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ది చెబుతారని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ కోడూరు మండల కార్యదర్శి రాజశేఖర్, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నవీన్, నితీష్, మదన్, నరసింహ, వంశీ, రాజేంద్ర, వెంకటేష్, మణి, వినయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Comments